IRCTC Best Summer Vacation Tour: ఈ వేసవి సెలవుల్లో కుటుంబంతో సహా చక్కగా ఆనందించేందుకు, ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ అద్భుతమైన వెకేషన్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అందాలను ఆస్వాదించే అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ టూర్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది. ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలుసుకుందాం.
వేసవి సెలవుల్లో ఈసారి ఈశాన్య రాష్ట్రాలు సందర్శించి ఎండల నుంచి రిలాక్స్ పొందడమే కాకుండా అద్భుతమైన అందమైన ప్రదేశాలను తిలకించే అవకాశం ఇది. ఐఆర్‌సీటీసీ నార్త్ ఈస్ట్ టూర్ ప్యాకేజ్ ఇది. విలాసవంతమైన రైల్లో 15 రోజులపాటు కుటుంబంతో సహా తిరిగి రావచ్చు. మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది ఈ ప్రయాణం. ఈశాన్య రాష్ట్రాల్లోని సెవెన్ సిస్టర్స్ అందాలను ఆస్వాదించవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ నార్త్ ఈస్ట్ డిస్కవరీ పేరుతో లగ్జరీ రైళ్లో టూర్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ టూర్ ద్వారా మొత్తం 5 ఈశాన్య రాష్ట్రాలు సందర్శించవచ్చు. ఏప్రిల్ 22 వతేదీన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. బోర్డింగ్ పాయింట్లలో ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఎటావా, కాన్పూర్ ఉన్నాయి. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ రైలులో 15 రోజుల పాటు 5800 కిలోమీటర్లు తిరిగి రావచ్చు.
ఏప్రిల్ 22న ప్రారంభమయ్యే ఈ టూర్ అస్సోంలో గౌహతి, శివసాగర్, జోర్హాట్, కజిరంగా ప్రాంతాలు కవర్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్, త్రిపురలోని ఉనకోటి, ఉదయపూర్, నాగాలాండ్‌లోని దిమాపూర్, కోహిమా, మేఘాలయాలోని షిల్లాంగ్, చిరపుంజి ప్రాంతాలు సందర్శించవచ్చు. బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ సందర్శన కూడా ఉంటుంది. మార్గమద్యలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలు , ఆలయాల సందర్శన ఉంటుంది. జోర్హాట్‌లోని టీ తోటల సందర్శన ఉంటుంది. కజిరంగ నేషనల్ పార్క్‌లో సఫారీ ప్రత్యేక ఆకర్షణ. ఈశాన్యంలోని అంగ్కోర్ వాట్ ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఉదయపూర్‌లోని ప్రముఖ ఉజ్జయంత ప్యాలెస్, నీర్మహల్ ప్యాలెస్, త్రిపుర సుందరి మందిర్ సందర్శించవచ్చు. కోహిమా ప్రాంతంలో నాగ జీవన విధానం తెలుసుకోవచ్చు. చిరపుంజి విహారయాత్ర ఉంటుంది. వాటర్ ఫాల్స్, కేవ్స్ ప్రత్యేకంగా సందర్శన ఉంటుంది.
భారత్ గౌరవ్ డీలక్స్ రైలు ప్రత్యేకతలు
ఈ రైలు చాలా విలాసవంతంగా ఉంటుంది. రెండు డైనింగ్ రెస్టారెంట్లు ఉంటాయి. ఫ్లేమ్ లెస్ కిచెన్, షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్ రూమ్స్, ఫుట్ మసాజర్లు, మినీ లైబ్రరీ, సీసీటీవీ కెమేరా, ఎలక్ట్రానిక్ సేఫ్‌లు ప్రతి కోచ్‌లో ఉంటాయి. ఇందులో ఏసీ ప్రీమియర్, డీలక్స్, కంఫర్ట్ విభాగాలు ఉన్నాయి.
ధర ఎంతంటే
ఏసీ ప్రీమియం అయితే ఒక్కొక్కరికి 1,67,845 రూపాయలు కాగా కేబిన్ అయితే 1, 49,815 రూపాయలు ఉంటుంది. ఇక ఏసీ డీలక్స్ అయితే ఒక్కొక్కరికి 1,29,915 రూపాయలు టికెట్ ఉంటుంది. ఇక కంఫర్ట్ విభాగంలో ఒక్కొక్కరి టికెట్ 1,16,905 రూపాయలు ఉంటుంది. రైలు ప్రయాణం, ఏసీ హోటల్స్‌లో రాత్రి బస, శాకాహార భోజనం, ప్రయాణ ఖర్చులు, వివిధ సందర్శనా స్థలాలకు బస్సుల్లో టికెట్ ఖర్చులు, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్ సేవలు అన్నీ ఈ ప్యాకేజ్‌లో భాగంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం సమ్మర్ వెకేషన్ అద్భుతంగా ప్లాన్ చేసేందుకు వెంటనే టికెట్ బుక్ చేసుకోండి.
Also read: Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు షాక్, నియామకాలు నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









