Tatkal Ticket Booking: ఇండియన్ రైల్వేస్ నుంచి కీలకమైన అప్‌డేట్. తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పులు జరగనున్నాయి. టికెట్ బుకింగ్‌లో అక్రమాలు, అవకతవకలను అరికట్టేందుకు రైల్వే శాఖ బుకింగ్ విషయంలో కీలకమైన మార్పులు చేసింది. ఈ కొత్త మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
జూలై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే ప్రయాణీకులు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోగలరు. ఐఆర్సీటీసీ చేసిన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇ ఆధార్ అథెంటికేషన్‌తో అనధికారిక టికెట్ బుకింగ్, నకిలీ ఎక్కౌంట్లు, ఒకేసారి ఎక్కువ టికెట్ల బుకింగ్ వంటి అక్రమాలను అరికట్టవచ్చు. రైల్వే టికెట్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ ప్రక్రియ చేపట్టింది.
జూలై 15 నుంచి ఆధార్ ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి చేయనుంది. టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణీకుడి ఆదార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్లకు ఈ విధానం వర్తింపజేసి ఆ తరువాత సాధారణ టికెట్లకు కూడా అమలు చేయవచ్చు. ఇప్పటికే టికెట్ల బుకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చింది. చాలా సందర్భాల్లో అప్పటికప్పుడు నకిలీ మెయిల్స్ సృష్టించి టికెట్లు బుక్ చేసుకోవడాన్ని నియంత్రించేందుకు ఏఐ టూల్స్ ఉపయోగించనుంది. గత ఏడాది ఐఆర్సీటీసీలో 35 మిలియన్ల అనధికారిక యూజర్ ఐడీలను రైల్వే శాఖ బ్లాక్ చేసింది.
Also read: Aadhaar Pan Card: మరణించిన వ్యక్తి ఆధార్, పాన్ కార్డులను ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook