Tatkal Tickets: ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఇండియన్ రైల్వే సరికొత్త మార్పులు చేసింది. బుకింగ్ మరింత వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా ఉండేందుకు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. టికెట్ బుకింగ్‌లో ఏఐ టెక్నాలజీ వల్ల కలగనున్న ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ వ్యవస్థలో తత్కాల్ టికెట్లకు డిమాండ్ పెరుగుతోంది. అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఈ సౌకర్యం అద్భుతంగా ఉపయోగపడుతోంది. అయితే నకిలీ బుకింగ్‌లు, వెబ్‌సైట్ క్రాష్ అవడం, వేగంగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా సమస్యల్ని పరిష్కరిస్తూ తత్కాల్ టికెట్ వ్యవస్థను మరింత ఈజీ చేసేందుకు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టింది. ఏసీ, నాన్ ఏసీ కేటగరీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రతి ప్రయాణీకుడికి టికెట్ పరిమితి కూడా నిర్ణయించారు.
కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే
ఈ కొత్త వ్యవస్థ పేరు ఏఐ పవర్డ్ ఫాస్ట్ బుకింగ్ సిస్టమ్. ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం 10 గంటలకు నాన్ ఏసీ ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ప్రతి ప్రయాణీకుడికి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒకటి ఉండాలి. పేమెంట్ అయితే యూపీఐ, క్రెడిట్ కార్డు, బిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. నిర్ణీత సమయం కంటే మూడు గంటలు రైలు ఆలస్యం లేదా రైలు రద్దయితే మాత్రమే రిఫండ్ పాలసీ వర్తిస్తుంది.
తత్కాల్ బుకింగ్ కొత్త నిబంధనలు ఇలా
తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేసేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏసీ, నాన్ ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ మారాయి. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌కు ప్రాధాన్యత ఉంటుంది. ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల నకిలీ బుకింగ్స్ బెడద తగ్గుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సైట్ డౌన్ కాకుండా ఉంటుంది. రియల్ టైమ్ అప్‌డేట్స్ అందుబాటులో ఉండటంతో ప్రయాణీకుల సీట్ల లభ్యతపై వెంటనే సమాచారం లభిస్తుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండటంతో మేన్యువల్ తప్పిదాలకు ఆస్కారం ఉండదు.
Also read: Heavy Rainfall Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ రేపు కుమ్మేయనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









