Summer Vacation Places: వేసవి వచ్చిందంటే చాలు సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. ఎండల నుంచి రిలీఫ్ పొందేందుకు సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. మరి కొద్ది రోజుల్లో స్కూల్స్, కళాశాలలు మూతపడనున్నాయి. ఆ తరువాత అందరూ సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. అందుకే ఐఆర్‌సీటీసీ కొన్ని టూరిజం ప్యాకేజీలు ఆఫర్ చేస్తోంది.
వేసవిలో వెకేషన్ కోసం కొంతమంది దేవాలయాలు, చారిత్రాత్మక ప్రాంతాలు సందర్శిస్తుంటే మరి కొందరు అందమైన హిల్ స్టేషన్లు, చల్లని ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు ప్లానింగ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ కేరళ, గోవా, కర్ణాటక, విశాఖపట్నం, ఊటీ ప్రాంతాలకు టూరిజం ప్యాకేజీలు ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో ఈ ప్రాంతాలు చుట్టి వచ్చేలా ఈ ప్యాకేజ్ ఉంటుంది. వీటిలో ముఖ్యమైంది కర్ణాటక టూర్ ప్యాకేజ్. ఇందులో పశ్చిమ కనుముల్ని చుట్టివచ్చేలా ప్రత్యేక ప్యాకేజ్ ఉంది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమౌతుంది. మురుడేశ్వర్, ఉడుపి, శృంగేరి ఆాలయాలను సందర్శించవచ్చు. కోస్టల్ కర్ణాటక పేరుతో మరో ప్యాకేజ్ కూడా ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్యాకేజీలు అందుబాటులో వచ్చేశాయి. ఐఆర్‌సీటీసీ అధికారిక పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఇక వేసవిలో అందరికీ నచ్చేది, ఇష్టపడేది చల్లని ప్రదేశమైన ఊటీ. దక్షిణ భారతదేశంలో చల్లని ప్రాంతం ఇదే. అందుకే ఊటీ అంటే ప్రత్యేక ఆకర్షణ ఎప్పుడూ ఉంటుంది. ఊటీతో పాటు కన్నూర్ వంటి ప్రాంతాల్ని సందర్శించేలా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈస్ట్ కోస్ట్ టూర్ ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం, అరకు, బొర్రా గుహల్ని వీక్షించే అద్బుత అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి ఈ ప్యాకేజ్ అందుబాటులో వచ్చింది.
ఇక కేరళలోని అలెప్పి, మున్నార్ పర్యాటక ప్రాంతాలని సందర్శించేందుకు కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజ్ కూడా హైదరాబాద్ నుంచి ప్రారంభమౌతుంది. ఇప్పటికే అందుబాటులో వచ్చింది. ఇందులో 5 రాత్రులు 6 పగలు ఉంటాయి. ఇదే కేరళలో మరో అద్భుతమైన ప్రదేశం వండర్స్ ఆఫ్ వయనాడ్. పచ్చని కొండలు, కాఫీ తోటలు చూడవచ్చు. ల్యాండ్ ఆఫ్ గాడ్స్ పేరుతో కేరళలోని వయనాడ్ అందాల్ని వీక్షించవచ్చు. ఏప్రిల్ 1 నుంచే ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంది.
Also read: Pan Card Alert: బిగ్ అలర్ట్ ఇదే చివరి అవకాశం, లేకపోతే మీ పాన్‌కార్డు రద్దయిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









