DGMOs Meeting Hotline: ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్, పాకిస్థాన్ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం.. ఆ వెంటనే ఉల్లంఘించడం జరిగిపోయాయి. ఈ క్రమంలో రేపు జరగనున్న డీజీఎంఓల సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో బలవంతంగా కాల్పుల విరమణకు అంగీకరించిన భారతదేశం ఆ తర్వాత కొన్ని గంటలకే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రి కాగానే కాల్పుల మోత.. డ్రోన్ల వర్షం కురిపించడంతో పాకిస్థాన్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో రేపు జరగనున్న డీజీఎంఓల సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటునేది చర్చనీయాంశంగా మారింది.
Also Read: Mothers Day: మదర్స్ డే ట్వీట్ వైరల్.. పర్వాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు 'అమ్మ' గుర్తు ఉంది
ఆపరేషన్ సిందూర్‌తో మొదలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం డొనల్డ్ ట్రంప్ చొరవతో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ.. ఉల్లంఘన తర్వాత జరిగిన పరిస్థితులపై భారత్, పాక్ మధ్య సోమవారం కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో జరగనున్న చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)లు పాల్గొంటారు. పరస్పర దాడులు.. కాల్పుల విరమణ కొనసాగడం.. సయోధ్య వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TS EAPCET Results: వివాదంలో తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు.. హరీశ్ రావు ఖండన
హాట్‌లైన్‌లో భారత్ డీజీఎంఓ పాకిస్థాన్ తీరును తప్పుబట్టనున్నారు. ఒప్పందం చేసుకుని ఎలా ఉల్లంఘనకు పాల్పడతారు? అని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనపై సమాధానం తర్వాతనే మిగతా అంశాలపై చర్చించే అవకాశం ఉందని సైనిక వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నిమిషాల పాటు జరిగే చర్చల అనంతరం స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. కాల్పుల విరమణను కొనసాగిస్తారా? లేదంటే ఇదే యుద్ధ వాతావరణం కొనసాగుతుందా? అనేది కొన్ని గంటల్లో తేలనుంది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఆగిపోనుందా అనేది కూడా తెలియనుంది.
డీజీఎంఓల సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది. భారత్ డీజీఎంఓతో పాకిస్థాన్ డీజీఎంఓ హాట్‌లైన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి. అనంతరం కాల్పులను విరమించుకుందామని అంగీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి రాగా.. కొన్ని గంటలకే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter









