ISRAEL Government: ఇజ్రాయిల్‌లో మిత్రపక్షాల తిరుగుబాటు, సంక్షోభంలో నెతన్యాహూ ప్రభుత్వం

ISRAEL Government: ఇజ్రాయిల్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూని మిత్రపక్షాలే హెచ్చరిస్తున్నాయి. పార్లమెంట్ రద్దు తీర్మానం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2025, 10:38 AM IST
ISRAEL Government: ఇజ్రాయిల్‌లో మిత్రపక్షాల తిరుగుబాటు, సంక్షోభంలో నెతన్యాహూ ప్రభుత్వం

ISRAEL Government: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ విపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి అధికార పార్టీ మిత్రపక్షాలే మద్దతిచ్చే పరిస్థితి కన్పిస్తోంది. మిత్రపక్షాల్లో తిరుగుబాటు రావడంతో నెతన్యాహు ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితి కన్పిస్తోంది. 

Add Zee News as a Preferred Source

ఇజ్రాయిల్ సంకీర్ణ ప్రభుత్వం అల్ట్రా ఆర్ధోడాక్స్ యువతను సైనిక సేవల నుంచి మినహాయించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఎందుకంటే ఈ సమస్య ఇజ్రాయిల్‌ను రెండుగా విభజించింది. గాజా యుద్ధం నేపధ్యంలో ఈ సమస్య పెరిగింది. దేశంలోని యువతలో ఎక్కువమంది ఆర్మీలో పని చేస్తుండగా ఓ వర్గానికి మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్ రద్దు బిల్లును ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. దీనికి నెతన్యాహూ సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాలు సైతం మద్దతిచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ఆ దిశగా ఆ పార్టీలు హెచ్చరించాయి. దాంతో నెతన్యాహూ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే కచ్చితంగా నెతన్యాహూ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేకపోలేదు. 

అయితే నెతన్యాహూ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం అనుసరిస్తోంది. బిల్లుపై రాజీకు వచ్చేందుకు ఇతర బిల్లుల్ని కూడా చేర్చింది. పార్లమెంట్ రద్దు చేయాలంటే ప్రతిపక్షాలకు మరో మూడు ఓట్లు కావల్సి ఉన్నాయి. హమాస్ దాడి తరువాత ఇజ్రాయిల్ ప్రభుత్వానికి ఇదే అతి పెద్ద దెబ్బ. ఇజ్రాయిల్ చరిత్రలో ఇది అతిపెద్ద భద్రతా వైఫల్యంగా పరిగణిస్తున్నారు. 

Also read: Aadhaar Pan Card: మరణించిన వ్యక్తి ఆధార్, పాన్ కార్డులను ఏం చేయాలి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News