Husband Suicide: భార్య వేధింపులతో మరో భర్త ఆత్మహత్య.. 'భర్తల చట్టం రావాలి' అని విజ్ఞప్తి

Another Husband Forced To Take His Own Life By His Wife: భార్య బాధితుల కేసులు పెరిగిపోతుండగా.. మరొక భర్త ప్రాణం తీసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక ఓ అమాయక భర్త ప్రాణాలు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 28, 2025, 04:43 PM IST
Husband Suicide: భార్య వేధింపులతో మరో భర్త ఆత్మహత్య.. 'భర్తల చట్టం రావాలి' అని విజ్ఞప్తి

Husband Suicide With Wife Harassment: భార్యల వేధింపులతో అల్లాడుతున్న భర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి కొన్ని వారాలు కూడా గడవలేదు మరో భార్య బాధితుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా భర్తల కోసం ప్రత్యేక న్యాయ వ్యవస్థ, చట్టాలు రావాలని భార్య బాధితుడు కోరుకున్నాడు. అతడు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Chit Fraud By Colie: నాడు అడ్డాకూలీ.. నేడు రూ.100 కోట్ల 'చిట్టీ'ల మోసగాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన మానవ్‌ శర్మ (35) ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్‌మెంట్‌ మేనేజర్‌గా పని చేస్తుండేవాడు. అతడు గతేడాది 2024లో వివాహమైంది. ఉద్యోగ రీత్యా మానవ్‌ శర్మ భార్యతో కలిసి ముంబైలో కాపురం పెట్టాడు. కొన్నాళ్లు బాగానే ఉన్న వీరి కాపురం తర్వాత విభేదాలు మొదలయ్యాయి. భార్యతో తగువులు మొదలయ్యాయి. నిత్యం గొడవలు జరుగుతుండమే కాకుండా తనపై వేధింపులకు పాల్పడుతోందని.. చిత్రహింసలు పడుతున్నట్లు మానవ్‌ శర్మ వాపోయాడు.

Also Read: Saweety Boora: క్రీడల్లో ప్రపంచం జైకొట్టినా ఇంటిపోరు తప్పలే! భారత క్రీడాకారిణికి వరకట్న వేధింపులు

ఫిబ్రవరి 24వ తేదీన అతడు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడేముందు మానవ్‌ శర్మ తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆడ జాతిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. భర్తల కోసం.. పురుషుల కోసం ప్రత్యేక న్యాయ వ్యవస్థ, చట్టాలు రావాలని ఆ వీడియోలో మానవ్‌ కోరాడు. చనిపోతుండడంతో తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరాడు. తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు.

'సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. పురుషులు కూడా చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఎవరో ఒకరు మగవారి గురించి కూడా మాట్లాడాలి' అని మానవ్‌ శర్మ వీడియోలో కోరాడు. అతడి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్‌లు జరగలేదు. కాగా భార్య వాదనను కూడా పోలీసులు వింటున్నారు. తన భర్త చేసిన ఆరోపణలను భార్య ఖండించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News