)
Girl runs away home to marry boy friend but returns wedded to another in indore: ఇటీవల కాలంలో చాలా మంది ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమలో ఉంటే వారితో కలిసి కొన్ని రోజులు జర్నీ చేస్తారు. అసలు లైఫ్ గురించి ప్లాన్ లు, అలవాట్లు ఓపెన్ గా మాట్లాడుకుంటారని చాలా మంది భావిస్తారు. ఒక వేళ తమ ఆలోచనలు మ్యాచ్ కాకుండా బ్రేకప్ లు చేప్పుకుంటారు. కానీ కొంత మంది నీచులు పవిత్రమైన ప్రేమను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు.
అవసరాలు తీరే వరకు ఒకలా.. తీరిపోయాక మరోలా ప్రవర్తిస్తున్నారు. తమను ప్రేమించిన వాళ్లను మోసం చేస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు.. చివరకు ఆత్మహత్యలు చేసుకొవడం లేదా చంపడం వంటివి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక దుర్మార్గుడు యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అయితే.. ఇది అచ్చం సినిమాల్లో మాదిరిగా పదిహేనేళ్ల క్రితం వచ్చిన కరీనా కపూర్ నటించిన జబ్ వీ మెట్ లో మాదిరిగా జరిగింది.
ఇండోర్ కు చెందిన శ్రద్దా తివారీ,సార్థక్ అనే యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. అతడికి ఇంట్లో మ్యాచ్ లు చూస్తుండటంతో.. అతడ్ని పెళ్లి చేసుకుందామని చెప్పి రత్నం రైల్వే స్టేషన్ కు రావాలని చెప్పింది. తొలుత సరే అన్న అతను.. ఆ తర్వాత మాత్రం యువతి అక్కడకు వెళ్లే వరకు లేడు.
సార్థక్ కు ఫోన్ చేయగా.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను రావడంలేదని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో శ్రద్ధకు గుండె ఆగినంత పనైంది. ఇక సూసైడ్ చేసుకొవడం కోసం ఆలోచనలు చేస్తున్న ఆమెను.. కరణ్ దీప్ గమనించి పలకరించాడు. అతను.. ఆమె చదువుతున్న కాలేజీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. దీంతో ఆమె తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. ఇంటికి వెళ్లాలని కరణ్ చెప్పగా.. తాను ఈ విధంగా మాత్రం వెళ్లనని చెప్పింది. ఇంటికి పెళ్లి చేసుకుని మాత్రమే వెళ్తానని తెల్చి చెప్పింది.
దీంతో శ్రద్ధ బాధను అర్థం చేసుకున్న కరణ్ దీప్.. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో శ్రద్ద ఆబాధలో ఎగిరి గంతేసింది. వెంటనే ఇద్దరు కూడా.. మహేశ్వర్-మండలేశ్వర్‌కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత కొన్నిరోజులకు ఇండొర్ లోని ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. ఇద్దర్ని చూసి ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారు . ఇక చేసేది లేక ఇద్దర్ని ఇంటిలోపలికి తీసుకెళ్లారు. సార్థక్ కోసం వెళ్లి.. కరణ్ దీప్ ను పెళ్లి చేసుకొవడం ప్రస్తుతం అందరికి షాక్ కు గురిచేసింది. ఇది అచ్చం జబ్ వి మెట్ లా ఉందని అక్కడి వారు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఘటన నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.