)
2 Percent DA Hike: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్)పై ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న డీఏపై ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది. డీఏను రెండు శాతం మేర పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డీఏ పెంపుతో కలిపితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. పెంచిన డీఏ కేంద్ర ప్రభుత్వం 55 శాతంతో సమానంగా ఉందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నాలుగు లక్షలకుపైగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులు ప్రయోజనం లభిస్తుందని వివరించారు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయి చెప్పారు.
'మా ఉద్యోగులు 53 శాతం డీఏ పొందుతున్నారు. దీపావళి ముందు మేము దానిని కేంద్ర ప్రభుత్వం అందించే దానికి సమానంగా 55 శాతానికి డియర్నెస్ అలవెన్స్ పెంచాం' అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూనే అసంతృప్తి.. ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చిన డీఏ స్వాగతించదగినదే కానీ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
బకాయిల చెల్లింపులు.. సేవా సంబంధిత ప్రయోజనాలతో సహా దాని 11-పాయింట్ల చార్టర్ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో చేస్తునన్న చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఛత్తీస్గడ్ ప్రభుత్వం ప్రకటించిన డీఏతో ఇతర రాష్ట్రాల్లో కూడా డీఏ చెల్లించాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అదే స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు డీఏ ప్రకటించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.