IIT Baba Video: గంజాయితో దొరికి పోయిన ఐఐటీ బాబా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు.. వీడియో వైరల్..

Viral Iit baba: ఐఐటీ బాబా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయాడు.ఈ క్రమంలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 3, 2025, 07:32 PM IST
  • మరో వివాదంలో ఐఐటీ బాబా..
  • కేసు నమోదు చేసిన పోలీసులు..
IIT Baba Video: గంజాయితో దొరికి పోయిన ఐఐటీ బాబా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు.. వీడియో వైరల్..

iit baba controversy arrested in Jaipur: కుంభమేళ ఐఐటీ బాబా ఇటీవల తరచుగా వివాదాలలో ఉంటున్నారు. ఇటివల ఆయనను ఒక టీవీ షో డిబేట్ లో కొంత మంది సాధులు కొట్టిన విషయం తెలిసిందే. ఆయన బాబా కాదని.. కేవలం ఫెమస్ అవ్వడానికి మాత్రమే ఇలా లేని పోనీ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో  ఐఐటీ బాబా జైపూర్ లోని ఒక హోటల్ లో తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నాడు.

Add Zee News as a Preferred Source

 

అయితే.. గంజాయి కూడా తీసుకున్నాడు. ఆయన అదే మత్తులో తన అభిమానులకు సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అభిమానులు పోలీసులకు అప్రమత్తం చేశారు. వెంటనే హోటల్ కు వెళ్లి చూసిన పోలీసులకు ఐఐటీ బాబా గంజా తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి దొరకడంతో..  ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

తక్కువ స్థాయి అఫెన్స్ కావడంతో ఆయనను పోలీసులు హెచ్చరించి, బెయిల్ మీద విడిచిపెట్టారు. అయితే.. ఐఐటీ బాబా తాను గంజాయి మత్తులో సూసైడ్ చేసుకుంటున్నట్లు మాట్లాడానని, అదేంలేదని కొట్టిపారేశారు. ఇక్కడ ఐఐటీ బాబా మాట్లాడుతూ గంజాయి ప్రసాదమన్నారు. అంతేకాకుండా.. తీసుకుంటే తప్పేమని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. కుంభమేళలో ఐఐటీ బాబా ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు.

దేశ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఆయనను గురువుగా భావించారు. కానీ ఆయన మాత్రం.. ఈ విధంగా గంజాయితో దొరికిపొవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనను తిట్టిపోస్తున్నారు. 

Read more: Cobra Snake Video: ఏంటక్కా.. పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా..?.. వీడియో చూస్తే షాక్ అవ్వాడం పక్కా..

ఈ క్రమంలో ఐఐటీ బాబా తన అభిమానులు, ఫ్రెండ్స్ మధ్య ఈరోజు జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ఈరోజున తన పుట్టిన రోజని దయచేసి.. ఎలాంటి గొడవల గురించి తనను ప్రశ్నించ వద్దరి మీడియాతో ఐఐటీ బాబా కోరారు. ప్రస్తుతం ఐఐటీ బాబా చేసిన ఘన కార్యం నెట్టింట వైలర్ గా మారింది. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News