Jamili Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సమయంలో జరిపించాలనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యం. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తరువాత ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
జమిలి ఎన్నికల నిమిత్తం రెండు బిల్లుల్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులలకు లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరమౌతుంది. దాంతో పాటు సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంటుంది. దేశంలో దాదాపు సగం రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వాలే ఉన్నందున ఆ సమస్య ఎదురుకాదు. ఇక పార్లమెంట్ ఉభయసభల్లో కూడా బిల్లుకు ఆమోదం లభించవచ్చు. ఇదంతా ఇలా ఉంటే అసలు దేశంలో జమిలి ఎన్నికలకు ఏ రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి, ఏవి వ్యతిరేకిస్తున్నాయని, ఏవి ఇంకా స్పందించలేదో తెలుసుకుందాం.
జమిలి ఎన్నికలకు సై అన్న పార్టీలు
బీజేపీ, అన్నాడీఎంకే, అప్నాదళ్, బిజూ జనతాదళ్, అసోం గణపరిషత్, శివసేన, జేడీయూ, అకాళీదళ్
జమిలి ఎన్నికల్ని వ్యతిరేకించే పార్టీలు
కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, సీపీఐ, డీఎంకే, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ
జమిలీపై స్పందించని పార్టీలు
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎన్‌సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్‌డి, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్,కేరళ కాంగ్రెస్
Also read: Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి, వచ్చే 3 రోజులు 4-5 డిగ్రీలకు ఉష్ణోగ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.