Terrifying Snowfall Video: సినిమా సీన్ కాదు..భయంకరంగా దూసుకొస్తున్న హిమపాతం, వీడియో వైరల్

Terrifying Snowfall Video: దేశంలో ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే జమ్ము కాశ్మీర్‌లో మాత్రం విపరీతంగా మంచు కురుస్తోంది. మంచు కురవడం కాదు..భయపెడుతోంది. అచ్చం సినిమాల్లో చూపించినట్టే మంచు దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2025, 01:54 PM IST
Terrifying Snowfall Video: సినిమా సీన్ కాదు..భయంకరంగా దూసుకొస్తున్న హిమపాతం, వీడియో వైరల్

Terrifying Snowfall Video: సాధారణంగా పెద్దఎత్తున మంచు కొండలు దూసుకురావడం సినిమాల్లో చూస్తుంటాం. అదంతా గ్రాఫిక్స్ మాయాజాలం. కానీ అచ్చం అలానే నిజమైన దృశ్యాలు జమ్ము కాశ్మీర్‌లో కన్పిస్తున్నాయి. భారీ హిమపాతం దూసుకొస్తూ స్థానిక ప్రజల్ని భయపెడుతోంది. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

హిమాలయాల్లో ప్రతి ఏటా శీతాకాలంలో మంచు చరియలు విరిగిపడుతుంటాయి. ఇవి ఎంత వేగంగా ఉంటాయంటే కేవలం 5 సెకన్ల వ్యవధిలో 80 మైళ్ల వేగంతో దూసుకొస్తాయి. దాదాపుగా 2.3 లక్షల ఘనపు మీటర్ల మంచును తీసుకొస్తాయి. కొన్నిసార్లు ఇవి విపత్తులుగా మారుతుంటాయి. గతంలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా మనా గ్రామంలో భారీ హిమపాతం కారణంగా మంచు కొండలు విరిగిపడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందిని సహాయక బృందాలు రక్షించగలిగాయి. ఇప్పుడు అదే విధంగా జమ్ము కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. సోన్‌మార్గ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీగా మంచు దూసుకురావడంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చం సినిమాల్లో చూపించనట్టే భారీగా హిమపాతం వేగంగా దూసుకొస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో ఓ పెద్ద ట్రక్ ఆగి ఉంటుంది. అందులోంచి ఇద్దరు ముగ్గురు కిందకు దిగి ఉంటారు. అంతలో వెనుకవైపు నుంచి భారీగా హిమపాతం దూసుకొస్తూ మొత్తం ఆ ప్రాంతాన్ని కమ్మేస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ జనం మాత్రం భయపడిపోతున్నారు. మంచు భారీగా పడుతున్నప్పుడు స్థానిక యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటుంది. జమ్ము కాశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు ఎంతకాలం ఉంటుందో ఇంకా అంచనా వేయలేమంటున్నారు.

 

Also read: Passport changes: ఆ వివరాల్లేకుండా పాస్‌పోర్ట్, ఏయే డాక్యుమెంట్లు అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News