)
Jammu Kashmir Police Station Blast Video: ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఘోర పేలుడు దుర్ఘటన మరువక ముందే మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పేలుడు జరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 30 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో మరో ఐదుగురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. చనిపోయిన వారు ఫోరెన్సిక్, అగ్నిమాపక నిపుణులని పోలీసులు గుర్తించారు. ఇటీవల దేశంలో ఉగ్రకుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ నుంచే ఛేదించారు కాగా ఇదే పోలీస్ స్టేషన్లో లక్ష్యంగా తాజాగా బ్లాస్ట్ జరిగింది.
పేలుడు సంభవించగానే 300 అడుగుల దూరంలో కూడా వారి శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పేలుడు పెద్ద ఎత్తున జరిగింది. రిస్క్యూ బృందం కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పేలుడికి ప్రధాన కారణం నిర్లక్ష్యంగా 360 కిలోల అమోనియం నైట్రైట్ పేలుడు పదార్థం సీల్ వేస్తున్న సమయంలో జరిగిందా? లేకపోతే ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా? అని పరిశీలిస్తున్నారు.
Just now a major blast has been reported at Nowgam Police Station in Srinagar- CCTV Footage! pic.twitter.com/TmESVX4Laa
— Chauhan (@Platypuss_10) November 14, 2025
అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక కారు పోలీస్ స్టేషన్ బయట ఉంది. అందులో IED అమర్చబడి ఉండవచ్చు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. జైషే అనుబంధ సంస్థ గ్రూప్ PAFF ఈ దాడికి కూడా బాధ్యత వహించినట్లు సమాచారం. ఇక దర్యాప్తులో అసలు విషయాలు బయటకి రావాల్సి ఉంది. ఈ నౌగమ్ పోలీస్ స్టేషన్ అనేది ఉగ్రవాద దాడులను ఛేదించే ప్రధానమైన ఒక పోలీస్ స్టేషన్. ఈ నేపథ్యంలో దీన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార చర్యలు చేపట్టి ఉండవచ్చు.
ఈ 360 కిలోల పేలుడు పదార్థాలు ప్రధానంగా ఫరిదాబాద్ లోని అరెస్టు చేసిన డాక్టర్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకుంది. మరో ఇద్దరు అల్ఫాలాల్ విశ్వవిద్యాలయంలో అరెస్టు చేశారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించడంతో 13 మందిని మృతి చెందారు. మెట్రో స్టేషన్ ఒక సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారులో ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం అలర్ట్ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook