Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు నేతలైతే మండి పడుతున్నారు. ఇక కొత్తగా పార్టీ స్థాపించిన విజయ్ అయితే నోరు అదుపులో పెట్టుకోమంటూ పవన్ కళ్యాణ్‌కు సూచిస్తున్నారు.
మొన్న పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ చాలా దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అసంతృప్తిని రాజేస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నాయి. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చురకలు అంటించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. హిందీ భాషను అందరూ నేర్చుకోవల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు చలనచిత్ర పరిశ్రమపై కూడా విమర్శలు సంధించారు. హిందీ వ్యతిరేకిస్తున్నవాళ్లు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదల్చిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తరాది అహంకారం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం క్లిప్పింగులు బయటకు తీసి..ఊసరవల్లి కంటే వేగంగా మారుతున్న పవన్ కళ్యాణ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు తాజాగా తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆవిర్భావ సభ జనసేనది కాగా ఎజెండా మాత్రం బీజేపీదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ముఖ్యంగా ఏపీకు చెందిన చాలామందికి జీవనోపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని, అలాగని ఆ భాషల్ని తమపై రుద్దాలని చూడటం మంచిది కాదన్నారు. మన తమిళ, తెలుగు, మలయాళ భాషల్ని హిందీ భాషలు ఉన్న రాష్ట్రాల్లో మూడో భాషగా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి