JNV Notification: జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27 లో ఆరవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాల్లో రెండు విడతల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రతి ఏటా 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తుంటారు. ఈ అడ్మిషన్లు రెండు విడతల్లో జరిగే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. జమ్ము కాశ్మీర్ సహా ఇతర పర్వత ప్రాంతాల్లో వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ 11వ తేదీన జరుగుతుంది. అర్హులైన విద్యార్ధులు జూలై 29 వరకు జవహర్ నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆరవ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అధికారిక వెబ్‌సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/ ద్వారా అప్లై చేసుకోవాలి. పరీక్ష విధానం తెలుసుకునేందుకు మోడల్ పేపర్లు కూడా ఇదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
Also read: AP Exams System: స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్, ఇకపై పుస్తకాల్లో పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









