బీజేపీ ఓడింది.. అంతే చాలు అంటున్న మాజీ ముఖ్యమంత్రి !

బీజేపీ ఓడింది.. అంతే చాలు అంటున్న మాజీ ముఖ్యమంత్రి !

Last Updated : Dec 11, 2018, 04:30 PM IST
బీజేపీ ఓడింది.. అంతే చాలు అంటున్న మాజీ ముఖ్యమంత్రి !

రాయ్‌పూర్ : చత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తు ముందంజలో వుండగా బీజేపీ మాత్రం 13 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శించుకోగలిగింది. మొత్తం 90 స్థానాలు వున్న చత్తీస్‌ఘడ్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ సర్కార్ అధికారంలో వుంటు వస్తోంది. ఇదిలావుంటే, ఈసారి ఎన్నికల్లో పోటీ అధికార పార్టీ అయిన బీజేపీ, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌తోపాటు జనతా కాంగ్రెస్ చత్తీస్‌ఘడ్ (జేసీసీ) పార్టీల మధ్యే వుండింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో వుండి, బీజేపీ వెనుకంజలో వుండటంపై జేసీసీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి హర్షం వ్యక్తంచేశారు. 

ఓట్ల లెక్కింపులో బీజేపీ వెనుకబడటంపై అజిత్ జోగి మీడియాతో మాట్లాడుతూ.. ''గత 15 ఏళ్లుగా అధికారంలో వున్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు'' అని అన్నారు. ఏదేమైనా రమణ్ సింగ్ సర్కార్‌‌ని ఓటర్లు తిరస్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అజిత్ జోగి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇకపై రాష్ట్రంలో ఓటర్లకు జేసీసీ మూడో ప్రత్యామ్నాయంగా మారిందని భావించాల్సి ఉంటుందని జోగి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంపాటు కొనసాగిన అజిత్ జోగి ఆ పార్టీ నుంచి బయటికొచ్చి సొంతంగా జనతా కాంగ్రెస్ చత్తీస్‌ఘడ్ (జేసీసీ) ఏర్పాటు చేశారు.

Trending News