JEE 2025 Final Answer Key Released: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ జేఈఈ అడ్వాన్డ్స్ 2025 ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ అయినా https://jeeadv.ac.in లో వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఫైనల్ ఆన్సర్ కి కూడా విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్డ్స్ ఫలితాలు అనుకున్న సమయం కన్నా ముందుగానే కాన్పూర్ ఐఐటి రిజల్ట్స్ ప్రకటించేసింది. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఈ ఏడాది ఆరు విడతల్లో అంటే జూన్ 14, 21, 28, జూలై 4, 10, 16 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఫస్ట్ ఫేజ్‌లో జూన్ 11 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఇక జేఈఈ అడ్వాన్డ్స్ 2025 స్కోర్ తెలుసుకోవాలంటే కూడా ఇదే వెబ్‌సైట్లో https://jeeadv.ac.in క్లిక్ చేసి హోం పేజీలో మీ లాగిన్ డీటెయిల్స్ నమోదు చేయాలి. అప్పుడు స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. మీ వివరాలను వెరిఫై చేసుకొని స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ఏడాది మే 18 రెండు షిఫ్ట్ లలో జేఈఈ అడ్వాన్డ్స్ 2025 పరీక్షలను నిర్వహించారు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉన్నాయి. ఇక ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్ టఫ్ టాపిక్స్ అనే చెప్పవచ్చు.
ఈ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తద్వారా వీరికి నచ్చిన కాలేజీల్లో సీట్ పొందుతారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (III)ఇతర ప్రభుత్వ ఫండింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో కూడా సీట్లు పొందవచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 3 తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ప్రధానంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 రిజిస్ట్రేషన్ జూన్ 2 నుంచి జూన్ మూడో తేదీ నుంచి ఓపెన్ ఉంటుంది. ఇక జూన్ 5 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 8వ తేదీ దీనికి సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేస్తారు.
ఇక గతంలో జేఈఈ అడ్వాన్డ్స్ 2024 ఎగ్జామ్ ఫలితాలు వేద్ హుతి, ఆదిత్య ఐఐటి ఢిల్లీకి టాప్ ర్యాంకర్స్ గా నిలిచారు. వీళ్లు వరుసగా 355 మార్కులకు గాను వీళ్ళు 346 మార్కులు పొందారు. ఐఐటి బాంబే కి సంబంధించిన ద్విజ ధర్మ పటేల్ మహిళల్లో మొదటి ర్యాంకు సాధించారు .360 కి గాను 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించారు.ఈ పరీక్షకు 180,200 మంది హాజరయ్యారు. మొత్తంగా 48,248 మంది అడ్మిషన్ కి క్వాలిఫై అయ్యారు. ఐఐటి మద్రాస్ జోన్ ఎక్కువ శాతం మంది 1180, ఢిల్లీ ఐఐటి 10250, మంది ఐఐటి బాంబే 9480 మంది అర్హత సాధించారు.
Also Read: యువ వికాసానికి బ్రేక్.. లోతైన పరిశీలన జరిగిన తర్వాత వారికి మాత్రమే..!
Also Read: Regrow Hair: ఈ 5 నేచురల్ ఫుడ్స్ తింటే చాలు.. ఊడిన జుట్టు కూడా మళ్లీ పెరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









