JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి

JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2025, 06:17 PM IST
JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి

JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాల కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్ధులు అధికారిక వెబ్‌‌సైట్ ద్వారా చెక్ చేసుకుని స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Add Zee News as a Preferred Source

దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీ, ఎన్ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రెండు పరీక్షల్ని నిర్వహిస్తుంటుంది. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో ఉంటుంది. ఈ రెండింటిలో ఎందులో అర్హత సాధించినా అడ్వాన్స్ రాసేందుకు వీలుంటుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష పత్రంలో వచ్చిన 12 ప్రశ్నల్ని తొలగిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. దాంతో  ఆ 12 ప్రశ్నలకు పూర్తి మార్కులు పడనున్నాయి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షలు జనవరిలో ముగిశాయి. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ప్రస్తుతం సెషన్ 2 కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఉత్తీర్ఘులైన అభ్యర్ధులు మే నెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. 

జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల నుంచి 2.5 లక్షలమందిని అడ్వాన్స్‌కు ఎంపిక చేస్తారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు jeemain.nta.nic.in. లో కాస్సేపట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సైట్ ఓపెన్ చేశాక వ్యూ స్కోర్ కార్డ్ లేదా వ్యూ జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. మీ స్కోర్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also read: Renu Desai Fired: ఆ ఇడియట్‌కు దూరంగా ఉండండి, రేణు దేశాయ్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News