JEE Main 2025 Admit Card: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల అడ్మిట్ కార్డుల్ని విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 9 వరకూ వివిధ దశల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్షకు 4-5 రోజుల ముందు హాల్ టికెట్లను ఎన్టీఏ విడుదల చేస్తుంటుంది
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2025 పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మెయిన్ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటుంది. ఆ తరువాత మే నెలలో అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. ఇటీవల జనవరి నెలలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు త్వరలో అంటే ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో పేపర్ 1 బీటెక్ విభాగం జరగనున్నాయి. ఇక బీఆర్క్, బీప్లాన్ విభాగం పరీక్షలు ఏప్రిల్ 9న జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 రాసే అభ్యర్ధులు తమ అడ్మిట్ కార్డుల్ని jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయల్సిందల్లా మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ కావడమే.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి. అక్కడ కన్పించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. ఆ తరువాత డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ అడ్మిట్ కార్డు ప్రత్యక్షమౌతుంది. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









