JEE Main 2025 Session 2 Rules: దేశంలో జేఈఈ మెయిన్ 2025 తుది దశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 నుంచి వివిధ దశల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించి కీలకమైన సూచనలు గమనించాల్సి ఉంది. ఆఖరికి డ్రెస్ కోడ్ కూడా చాలా ముఖ్యమైంది.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 9 వరకూ జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి. మరో 3 రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలకు సంబంధించి కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2, 3,4,7,8,9 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 8న జరిగే పరీక్ష కేవలం ఉదయం షిఫ్టులోనే ఉంటుంది. ఏప్రిల్ 9వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా విద్యార్ధులకు డ్రెస్ కోడ్ ఇతర అంశాలకు సంబంధించి కీలకమైన జాగ్రత్తలు అందిస్తోంది.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 డ్రెస్ కోడ్
పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దుస్తులపై మెటాలిక్ అలంకరణలు ఉంటే అనుమతించరు. బూట్లు, మందంగా ఉన్న చెప్పులు ధరించకూడదు.లోహాలతో కూడిన వస్తువులు, ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకూడదు. స్కార్ఫ్, మఫ్లర్, స్టూల్స్, షాల్స్, టోపీలు, కలర్ గ్లాసెస్ ధరించకూడదు.
పరీక్ష కేంద్రానికి ఎప్పుడు చేరాలి
పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే గంట ముందు చేరుకోవాలి. ఉదయం సెషన్ 8.30 గంటలకు, మద్యాహ్నం సెషన్ 2.30గంటలకు గేట్లు మూసివేస్తారు. తరువాత లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మద్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు.
ఏవి తీసుకెళ్లాలి, వేటికి అనుమతి లేదు
మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రభుత్వ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్‌పరెంట్ పెన్, అడ్మిట్ కార్డు మాత్రమే అనుమతిస్తారు. బీఆర్క్ పరీక్షకు పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్ తీసుకెళ్లవచ్చు.
Also read: DA Hike Announcement: ఉద్యోగులకు బిగ్ జాక్‌పాట్, డీఏ పెంపు 2 శాతం కాదు 3 శాతం ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








