JEE Main 2025 Results: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల స్కోర్ ఆధారంగా ఫైనల్ ర్యాంకుల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేయనుంది. ప్రైమరీ కీ అభ్యంతరాల గడువు కూడా పూర్తవడంతో తుది ర్యాంకులు వెల్లడి కానున్నాయి. ఈ ర్యాంకుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందుతారు.
జేఈఈ మెయిన్ పరీక్షలు రెండు సెషన్లలో జరిగాయి. మొదటి సెషన్ పరీక్షలు జనవరిలో జరుగగా రెండవ విడత ఇదే నెల ప్రారంభంలో జరిగాయి. ఇప్పటికే రెండవ సెషన్ ప్రైమరీ కీ విడుదలైంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు గడువు కూడా ముగిసింది. దాంతో ఇక ఫైనల్ కీ విడుదల చేస్తూ రెండు సెషన్లలో వచ్చిన బెస్ట్ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు విడుదల చేయనున్నారు. మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు అర్హులుగా ప్రకటిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18న జరగనుంది. ఇందులో కూడా అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రైమరీ కీ ఏప్రిల్ 11న విడుదల చేసిన ఎన్టీఏ అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ఫీజుతో ఏప్రిల్ 13 వరకూ గడువు విధించింది. ఇప్పుడు ఈ గడువు పూర్తయింది. దాంతో తుది కీతో పాటు ర్యాంకులు పర్సెంటైల్ ఇవాళ విడుదల కానుంది.
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి. తరువాత అక్కడ కన్పించే జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చాలు..స్క్రీన్‌పై రిజల్ట్స్ కన్పిస్తాయి. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలు మార్కులు వర్సెస్ పర్సంటైల్ ఎలా ఉంటుందంటే
290-280 మార్కులు 99.999-99.997
280-250 మార్కులు 99.997-99.969
250-240 మార్కులు 99.969-99.946
240-230 మార్కులు 99.946-99.915
230-220 మార్కులు 99.915-99.866
220-210 మార్కులు 99.866-99.807
210-200 మార్కులు 99.807-99.731
200-190 మార్కులు 99.731-99.624
190-180 మార్కులు 99.624-99.480
180-170 మార్కులు 99.480-99.295
170-160 మార్కులు 99.295-99.069
మొత్తం 300 మార్కులకు జరిగే పరీక్షలో 160 మార్కుల వరకూ వచ్చినా 99 పర్సంటైల్‌లో ఉంటారు. ఆ తరువాత 98 పర్సంటైల్‌కు వెళ్తుంది.
Also read: Heavy Rains Alert: గంటల వ్యవధిలో 16 సెంటీమీటర్ల వర్షం, 5 జిల్లాలకు ఎల్లో ఆలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి