JEE Main 2025 Session 2: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు వివిధ షిఫ్టుల్లో జరగనున్నాయి. సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో పేపర్ 1 బీటెక్ విభాగం జరగనున్నాయి. ఇక బీఆర్క్, బీప్లాన్ విభాగం పరీక్షలు ఏప్రిల్ 9న జరుగుతుంది. సాధారణంగా ఇన్ని షిఫ్టుల్లో పరీక్ష జరుగుతున్నప్పుడు కొన్ని కఠినంగా ఉండవచ్చు. కొన్ని సులభంగా ఉండవచ్చు.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష్లల్లో ఏది కఠినంగా ఉంటుందనేది గతంలో జరిగిన పరీక్షలను బట్టి విశ్లేషిస్తుంటారు. జనవరిలో జరిగిన సెషన్ 1 పరీక్షల్లో కూడా జనవరి 28న ఉదయం జరిగిన పరీక్ష చాలా కఠినంగా ఉందనే వాదన విన్పించింది. గత ఏడాది సెషన్ 2 పరీక్షల్లో ఏప్రిల్ 8వ తేదీన జరిగిన రెండవ షిఫ్ట్ కఠినంగా ఉందని అంచనా వేశారు. ఈ లెక్కల గత అంచనాల ఆధారంగా ఈసారి జరిగే సెషన్ 2 పరీక్షల్లో ఏప్రిల్ 7న జరిగే పరీక్ష కఠినంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది అంటే 2024లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల్లో ఏప్రిల్ 4న జరిగిన షిఫ్ట్ 1, 2 పరీక్షలు, ఏప్రిల్ 5 జరిగిన షిఫ్ట్ 1, 2 పరీక్షలు, ఏప్రిల్ 6న జరిగిన షిఫ్ట్ 1,2 పరీక్షలు, ఏప్రిల్ 8న జరిగిన షిఫ్ట్ 1, 2 పరీక్షలు, ఏప్రిల్ 9న జరిగిన షిఫ్ట్ 1, 2 పరీక్షలు మోస్తరు నుంచి అత్యంత కఠినంగా సాగాయి. వీటికి ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఎంత కఠినంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు.
ఏప్రిల్ 7వ తేదీన జరిగే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 పరీక్షలు అత్యంత కఠినంగా ఉండవచ్చని అంచనా ఉంది. అదే విధంగా ఏప్రిల్ 3న జరిగే షిఫ్ట్ 2 పరీక్ష కాస్త కఠినంగా ఉండవచ్చు. ఇక ఏప్రిల్ 4వ తేదీన జరిగిన షిఫ్ట్ 1 పరీక్ష మోస్తరు కఠినంగా ఉండవచ్చు.
Also read: School Holidays: విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్, ఏప్రిల్ లో 3-4 రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









