Jharkhand above 10 naxals killed in encounter: జార్ఖండ్ లో పోలీసు బలగాలకు, నక్సల్స్ కు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో.. పది మంది వరకు నక్సలైట్ లు పొలసుల కాల్పుల్లో చనిపోయారు. ఈ రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో.. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లాల్పానియా ప్రాంతంలోని హిల్స్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ కోబ్రా, దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో పది మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికార వర్గాలు తెలిపాయి.
బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలు కొన్నిరోజులుగా నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు 5.30 గంటల ప్రాంతంలో. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో సిసి సభ్యుడు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఘటన ప్రదేశం నుంచి.. 8 మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో.. 1 ఎకె-47, 1 ఎస్‌ఎల్‌ఆర్ , 3 ఇన్సాస్ ,1 పిస్టల్ ఇప్పటివరకు 8 మంది భర్మర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిలో.. ఇప్పటికే కోటి రివార్డు ఉన్న నక్సలైన్ దళ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలీయాస్ వివేక్ కూడా ఉన్నారు. ఇతను పుచన, నాగ మాంఝీ, కరన్, లెతర పేర్లతో పిలుస్తున్నారు.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రయాగ్ మాంఝీ భార్య జయను గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఇదిలా ఉండగా... ఇప్పటికే 2025 చివరి నాటికి దేశంలో నక్సల్స్ లను పూర్తి స్థాయిలో ఏరీవేస్తామని ఇప్పటికే కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









