)
Jio Entry Level Home Plan: మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే కచ్చితంగా కనీసం రూ. 300 ఉండాల్సిందే. ఒక్కో టెలికాం కంపెనీలు అయితే ఏకంగా రూ.350 వరకు బేసిక్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే, మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలోనే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందిస్తుంది రిలయన్స్ జియో. అయితే ఈ ప్రైవేటు దిగ్గజ కంపెనీ అందిస్తున్న బంపర్ బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రకటించే ప్రైవేటు దిగ్గజా కంపెనీ రిలయన్స్ జియో హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. డేటా పూర్తయిపోయిన తర్వాత కూడా 30 mbps ఇంటర్నెట్ డేటా సదుపాయం కూడా ఉంది. అయితే రిలయన్స్ జియో అందిస్తున్న ఈ రూ.399 హోమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.399 హోమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 30mbps స్పీడ్ నెట్ లభిస్తుంది. దీని వ్యాలిడిటీ నెలరోజులు ఉంటుంది. అంటే ఇందులోనే జీఎస్టి కూడా ఉంటుంది. ఈ ప్లాన్ 6 నెలలు, 12 నెలల వ్యవధి కలిగి ఉన్న బేసిక్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ వాయిస్ కాలింగ్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
3.3 TB ఫెయిర్ యూసేజ్ పాలసీ డేటా కేవలం రూ.399కి మాత్రమే లభిస్తుంది. ఎలాంటి ఇతర ఎయిర్ ఫైబర్ యూజర్లు ఈ లబ్ధి పొందలేరు. ఇందులో రూ.599, రూ. 888 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 mbps స్పీడ్ నెట్ లభిస్తుంది. యాడ్ ఆన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక రూ.888 తో రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ సబ్‌స్క్రీప్షన్ కూడా పొందుతారు. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ కూడా లభిస్తుంది. 800 పైగా లైవ్ టీవీ ఛానల్స్ యాక్సెస్ కూడా పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook