Chief Justice BR Gawai: తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయి.. ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

CJI Sanjiv Khanna: ప్రస్తుత భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చే నెలలో రిటైర్మెంట్ కాబోతున్నారు.ఈ క్రమంలో ఆయన తాజాగా.. కేంద్ర న్యాయశాఖకు లేఖను రాశారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 03:59 PM IST
  • తదుపరి సీజేగా గవాయి..
  • కేంద్రానికి లేఖను రాసిన జస్టిస్ ఖన్నా..
Chief Justice BR Gawai: తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయి.. ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Justice br gawai to be the next chief justice of india: భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టుకు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా ఉన్నారు. అయితే.. ఆయన మే నెల 13న రిటైర్మెంట్ కానున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చీఫ్ జస్టిస్ గా బీఆర్ గవాయి పేరును సిఫారసు చేస్తు.. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ ఖన్నా లేఖను రాశారు.ఈ క్రమంలో జస్టిస్ గవాయి ఖన్నా రిటైర్మెంట్ మరుసటిరోజున నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించనున్నారు.  

Add Zee News as a Preferred Source

జస్టిస్ గవాయి మే నెల 14వ తేదీన భారత దేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయి పూర్తి పేరు..  భూషణ్ రామకృష్ణ గవాయ్.  ఆయన పేరును న్యాయ మంత్రిత్వ శాఖకు CJI సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. 

జస్టిస్ గవాయి.. మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించారు.  అదే విధంగా... 1985లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అయితే.. అంతకు ముందే ఆయన మాజీ అడ్వకేట్ జనరల్ మరియు హైకోర్టు న్యాయమూర్తి దివంగత రాజా ఎస్ భోంస్లేతో కలిసి పనిచేశారు.

గవాయి.. 1992 ఆగస్టులో  బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఆతర్వాత..  2000లో అదే బెంచ్‌కు గవర్నమెంట్ ప్లీడర్ గాను,  పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమితులయ్యారు.

Read more: Female Youtuber video: బెడ్ రూమ్‌లో ప్రియుడితో రాసలీలల్లో లేడీ యూట్యూబర్.. భర్త ఏంచేశాడంటే..?

జస్టిస్ గవాయ్ నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005లోపూర్తిస్థాయిలో న్యాయమూర్తి గా బాధ్యతలు తీసుకున్నారు. ముంబైలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను,  నాగ్‌పూర్, ఔరంగాబాద్,  పనాజీలలో బెంచ్‌లలో పనిచేశారు. మే 24, 2019న సుప్రీంకోర్టు జస్టిస్ గా  పదోన్నతి పొందారు. ఈక్రమంలో జస్టిస్ గవాయి..  మే 14న భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుని.. 2025, నవంబర్ 23న పదవీ విరమణ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News