
Justice Yashwant Varma cash Video: జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్క చూపని డబ్బు కాలిపోయిన స్థితిలో ఉన్న వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు, పోలీసుల కమిషనర్‌కు అప్ప చెప్పింది. అంతేకాదు జస్టిస్ వర్మ దీనిపై స్పందించారు కూడా. ఆయన నోట్ల కట్టలకు సంబంధించిన వివరణను పత్రాలను సుప్రీంకోర్టుకు అందజేశారు.
అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ మాత్రం తన నివాసంలో కాలిపోయిన నగదు తమపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మాత్రమే జరిగిన కుట్ర అన్నారు. తమకు తన కుటుంబానికి కాలిపోయిన నోట్ల కట్టలతో ఎలాంటి సంబంధం లేదు. తమకి ఇలా పెద్ద మొత్తంలో డబ్బు నిలువ చేసుకుని అలవాటు లేదు.. డబ్బులు లావాదేవీలన్నీ యూపీఐ, బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇక జస్టిస్ వర్మ తన ఇంట్లో ఇలా కాలిపోయిన స్థితిలో ఉన్న డబ్బు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించడానికి చేసిన కుట్రలో భాగమని ఆయన వివరించారు. ఈ వీడియోలో ఉన్న నోట్ల కట్టలు కూడా కాలిపోయిన వెంటనే తీసింది. పైగా పక్కనున్న సిబ్బంది కూడా ఎవరో చూపించలేదు. ఇదంతా తనపై కుట్రలో భాగమని జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై వచ్చిన ఆరోపణలపై వివరించారు.
అయితే జస్టిస్ వర్మపై భారత న్యాయమూర్తి సంజీవ్ కన్నా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి శివరామన్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జీఎస్ సంధవాలియా ఉన్నారు.
నోట్ల కట్టలకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ డీకే ఉపాధ్యాయ శనివారం 25 పేజీల నివేదికను సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కు ఎలాంటి న్యాయవారమైన పనులను అప్పగించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.
#BREAKING Video shared by Delhi Police Commissioner regarding the fire at Justice Yashwant Varma’s house, when cash currencies were discovered. pic.twitter.com/FEU50vHwME
— Live Law (@LiveLawIndia) March 22, 2025
అసలు ఏం జరిగింది?
మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి రప్పించారు. వాళ్లు వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అనుకోకుండా అక్కడ భారీ మొత్తంలో డబ్బులు కనిపించాయి. వెంటనే అగ్నమాపక సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో జస్టిస్ వర్మ లేరు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వెంటనే చేరుకున్న పోలీసులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలు చూశారు. ఇదంతా చీఫ్ జస్టిస్ ఖన్నాకు తెలిసింది. ఆయన వెంటనే కొలిజియాం ఏర్పాటు చేసి జస్టిస్ వర్మను అలహాబాద్ బదిలీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe