)
Kalkaji temple sewadar brutally beaten to death in delhi: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది యువకులు రెచ్చిపోయారు. కల్కాజీ ఆలయం పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గత.. పదిహేనుళ్లుగా ఢిల్లీలోని ప్రసిధ్ద కల్కాజీ ఆలయంలో సేవకుడిగా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొంతమంది యువకులు దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. దర్శనం తర్వాత ప్రసాదం పెట్టాలని యోగేంద్రను వారి కోరారు. కానీ అప్పటికే సమయం మించిపోవడం, ప్రసాదం కూడా అయిపోవడంతో ఆయన నిరాకరించాడు. దీంతో వారు రెచ్చిపోయారు .
A late night dispute over the distribution of prasad at Delhi’s Kalkaji Mandir turned deadly on Friday when a 35-year-old temple sewadaar was brutally beaten to death. The victim, Yogendra Singh, who had devoted over a decade of service to the shrine, was attacked in full public… pic.twitter.com/YDOyP1smqs
— Mojo Story (@themojostory) August 30, 2025
అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో సేవాదారుడిపై దాడికి దిగారు. పదే పదే పిడిగుద్దులు కూడా కురిపించారు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలీ పడిపోయాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానికులు ఆ సేవదారుడ్ని ఆస్పత్రికి తరలించారు.
విపరీతంగా రక్త స్రావం కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.