
Kamakhya Express Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ 11 భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు చనిపోయారని తెలిసింది. మరి కొంత మంది తీవ్ర గాయాలయ్యాయి. రైల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు. వారిని వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకు రావడానికి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుంది. ఆదివారం బెంగళూరు నుంచి కామాఖ్యకు వెళ్తున్న రైలు 12551 రైలు ఆదివారం ఉదయం 11: 50 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అయితే ఈ రైలు అతివేగంతో లేకపోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది.
ఈ ప్రమాదంతో రైలు ప్రయాణికులకు తీవ్ర భయాందోళనకు గురై అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా విషాదఛాయలు అలుముకుంది. అయితే ప్రమాదం పై రైల్వే శాఖ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు . వైద్య బృందం కూడా ఘటన స్థలానికి ఇప్పటికే చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
ఇప్పటికే ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ రైల్వే అధికారులను ఘటనపై ఆరా తీశారు. వారికి వెంటనే సహాయక చర్యలు అందించాలని సూచించారు. త్వరగా భువనేశ్వర్ నుంచి మరో ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అందరినీ ఆ రైలులో కామాఖ్యకు పంపించేలా చర్యలు చేపట్టారు. ఇక ట్రాక్ మరమ్మతులు కూడా ప్రారంభించారు.
Assam CM Himanta Biswa Sarma tweets "I am aware of the incident involving 12551 Kamakhya Express in Odisha. CMO Assam is in touch with the Odisha Government and Railways. We will reach out to each and every person who is affected." pic.twitter.com/8yEVzEEKnc
— ANI (@ANI) March 30, 2025
రైల్వే అధికారుల వివరాలు ప్రకారం.. ఆదివారం ఉదయం 11:50 గంటల సమయంలో ఖుర్దా రోడ్ డివిజన్లోని కటక్ నుంచి నార్గొండి వెళ్లే రైలు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు కామాఖ్య ఎసి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు.
అయితే ఈ రైలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. పరిస్థితులను అదుపులోకి తీసుకొని ప్రయాణికులకు మరో ప్రత్యేక రైలులో వారి గమ్యస్థానాలకు చేర్చే పనిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe