Ranya Rao: బంగారం అక్రమ రవాణా కేసులో ప్రముఖ కన్నడ నటి రన్యా రావుపై ఉచ్చు బిగుస్తోంది. రూ. 40 కోట్ల విలువైన 49.6 కిలోల బంగారం అక్రమ లావాదేవీల్లో రన్యారావుకు సహకరించడంలో సాహిల్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా దుబాయ్‌కు దాదాపు రూ. 38 కోట్లు, బెంగళూరులోని రన్యాకు కోటి 73 లక్షల రూపాయలను హవాలా డబ్బును బదిలీ చేయడంలో సాయం చేసినట్లు అతడు అంగీకరించినట్టు డీఆర్‌ఐ (Directorate of Revenue Intellegence) వెల్లడించింది. మార్చి 4న రన్యా నివాసంలో పట్టుబడిన రూ. 2 కోట్ల 67 లక్షల నగదును.. దుబాయ్‌లో బంగారం కొని, బెంగళూరులో విక్రయించడం ద్వారా ఆమెకు లాభంగా వచ్చిన హవాలా డబ్బుగా తెలిపింది. ప్రతి లావాదేవీకి రూ. 55 వేల కమీషన్ అందుకున్నానని సాహిల్ అంగీకరించినట్లు సమాచారం.
ఈ ఇయర్ జనవరిలో రూ 11 కోట్ల 56 లక్షల విలువైన 14.56 కిలోల బంగారాన్ని అమ్మేందుకు, హవాలా ద్వారా రూ. 11 కోట్లు దుబాయ్‌కు బదిలీ చేసేందుకు రన్యాకు సహకరించాడు సాహిల్. ఆమెకు కూడా రూ. 55 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఫిబ్రవరిలో రూ.11 కోట్ల 81 లక్షల విలువైన 13.43 కిలోల బంగారాన్ని విక్రయించేందుకు సాయం చేశాడు. అదే నెలలో రూ. 11 కోట్ల 25 లక్షల హవాలా నిధులను దుబాయ్‌కు, రూ. 55లక్షల 81 వేలను బెంగళూరులోని ఆమెకు బదిలీ చేశాడు’’ అని డీఆర్‌ఐ తెలిపింది. సాహిల్‌కు చెందిన రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన ఆధారాలు.. ఈ వ్యవహారాల్లో అతడి పాత్రను ఏమిటనేది తెలియజేస్తోంది.
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావు గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయింది. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రన్యా సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్ ఏ3గా కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ఏప్రిల్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు.. బెయిల్ కోసం రన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ విషయంలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం, 64వ సెషన్స్ కోర్టులో ఇప్పటికే ఆమెకు నిరాశ ఎదురైంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









