10th Class Exam Papers: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కాగా ఫలితాల కోసం నిరీక్షణ ఉంది. పదో తరగతి పరీక్షలు అందరికీ కీలకమైనవి. జీవితంలో ఇది తొలి మైలు రాయి. ఇది దాటితే ఆ తరువాత అంతా ఈజీ కావచ్చు. అందుకే పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు కూడా చోటుచేసుకుంటుంటాయి. పరీక్ష గట్టెక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. పరీక్ష పత్రాల్లో అప్పుడప్పుడూ కొన్ని వింతలు చోటుచేసుకుంటుంటాయి. కొందరు ప్రశ్నాపత్రమంతా భక్తితో నింపుతుంటే మరి కొందరు సినిమా స్టోరీలు రాస్తుంటారు. అయితే ఈ క్రమంలో కర్ణాటక నుంచి ఓ పదో తరగతి విద్యార్థి రాసింది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పదో తరగతి పాస్ చేయాలంటే ఏకంగా లంచ్ ఆఫర్ చేశారు ఓ విద్యార్థి. అవును నిజమే..ఇది ముమ్మాటికీ జరిగింది.
కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 3 నుంచి మార్చ్ 26 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.27 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో ఓ పదో తరగతి విద్యార్ధుల సమాధానపత్రంలో కన్పించింది చూసి అందరూ అవాక్కయ్యారు. పరీక్షల్లో పాస్ చేయాలంటూ విద్యార్ధులు డబ్బులు ఆఫర్ చేశారు. సమాధాన పత్రాలతో 500 రూపాయల నోటు జత చేర్చి సమర్పించారు. ఈ పత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్ని విజ్ఞాపనలు కూడా ఉన్నాయి. సార్ నన్ను దయచేసి పాస్ చేయండి ఈ 500 రూపాయలు తీసుకోండి, నా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు పాస్ చేయకపోతే తల్లిదండ్రులు నన్ను కాలేజీకు పంపరంటూ అభ్యర్ధిస్తూ రాసుకొచ్చారు. ఇలా ఒకరు కాదు పదుల సంఖ్యలో విద్యార్ధులు డబ్బులు ఆఫర్ చేశారు.
ఇక మరో విద్యార్థి రాసిన సమాధానం మరింత వైర్ అవుతోంది. సార్..నా ప్రేమ మీరు వేసే మార్కులపై ఆధారపడి ఉంది. నేను పాసైతే నా ప్రేమను కొనసాగిస్తాను అంటూ సమాధానపత్రంలో రాసుకొచ్చాడు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలియక చేసిన తప్పుగా వదిలేస్తారా లేక సదరు విద్యార్థులపై చర్యలు తీసుకుంటారా అనేది ఇంకా నిర్ణయించలేదు.
Also read: JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎప్పటి వరకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









