Karnataka madduramma temple fair video: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో హుసుర్ మడ్డురమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎంతో శక్తివంతమైనదిగా చెప్తుంటారు. ఇక్కడ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి తమ మొక్కలు మొక్కుకుంటు.. అవి తప్పకుండా నెరవేరుతాయని అక్కడి భక్తులు విశ్వాసం.
ఈ క్రమంలో దొడ్డనాగ మంగళ గ్రామంలో.. హుస్కుర్ మద్దురమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల అమ్మవారి ఊరేగింపు కోసం 120 అడుగుల భారీ రథాన్ని తీసుకొని వస్తున్నారు. అప్పటికే అక్కడ వాతావరణం అస్సలు బాగాలేదు. బలమైన ఈదురుగాలులు వస్తున్నాయి. అది కూడా ఏళ్లనాటి రథం కావడంతో భక్తులు ఎంతో జాగ్రత్తగా దాన్ని తీసుకొని వస్తున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా బలమైన గాలులు వచ్చాయి. అప్పుడు ఒక్కసారిగా రథం ఒకవైపుకు వంగిపోయింది. భక్తులు ఎంతగా కంట్రోల్ చేయాలని చూసిన కూడా, అది కంట్రోల్ కాలేదు. దీంతో బలమైన గాలివాన వల్ల.. రథం ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ప్రజలు దూరంగా పరుగులు పెట్టారు.
ఈ ఘటనలో సంఘటన స్థలంలో ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో భక్తులు గాయాలపాలైనట్లు సమాచారం .ఈ మేరకు ప్రస్తుతం గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం ఉత్సవంలో పెనువిషాదం కల్గించేదిగా మారింది.









