Karnataka DGP Ramachandra Rao Suspended : కర్ణాటక డీజీపీ రామ చంద్రరావు కొంత మంది యువతులతో ఆఫీసులోనే రొమాన్స్ కు దిగిన అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారి అమ్మాయిలను గాఢంగా హత్తుకుని, రాసలీలల్లో మునిగాడు. ప్రభుత్వ కార్యలయం అని కూడా చూడకుండా కౌగిలింతల్లో మునిగిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు సైతం ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించిన సిద్దరామయ్య ప్రభుత్వం తాజాగా.. డీజీపీ రామ చంద్రరావును విధుల నుంచి తొలగిస్తు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహరంలో డీజీపీ రామ చంద్రరావు హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మరోవైపు డీజీపీ రామ చంద్రరావు మాత్రం తాను అమాయకుడినని తనపై కావాలని కొంత మంది ఏఐ, ఫెక్ వీడియోలు క్రియేట్ చేసి ఈ విధంగా వైరల్ చేశారంటూ చెప్పుకున్నారు. మొత్తంగా డీజీపీ రామ చంద్ర రావు వ్యవహరంమాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీపీ డాక్టర్ కె. రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పరిపాలన సంస్కరణల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రవర్తన మొత్తంగా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు.
Read more: Karnataka dgp Video: ముద్దులతో రెచ్చిపోయిన పోలీసు బాస్.!. ఏకంగా ఆఫీస్ లోనే రాసలీలలు.. వీడియో..
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి విచారణపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్నుసస్పెన్షన్‌లో ఉంచుతున్నమని ఇది తక్షణమే అమల్లో వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లిస్తామని, ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం డీజీపీకి స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









