కరోనా వ్యాప్తి ( Covid 19 ) నేపథ్యంలో దేశంలో పలు విషాదకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  కర్ణాటకలో ( Karnataka Tragedy ) ఇలాంటి ఒక విషాద ఘటనే జరిగింది.  ఇందులో కూతురికి పెళ్లి చేసిన తండ్రి 24 గంటల్లోనే మరణించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ దేశంలో తాండవం ( Coronavirus Spread In India ) చేస్తోంది. లాక్‌డౌన్ ( Lockdown In India ) సమయంలో జరగాల్సిన శుభకార్యాలు అన్‌లాక్  ( Unlock )  సమయంలో జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ శుభకార్యాలే విషాదాలకు నెలవుగా మారుతున్నాయి. కర్ణాటకలోని రాయిచూరుకు ( Raichur Tragedy ) సమీపంలో ఉన్న సిరవార గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ( 49 ) ఇటీవలే తన కూతురికి పెళ్లి చేశాడు. తన బాధ్యత తీరిందని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంతోషం 24 గంటల్లోనే మాయం అయింది. కరోనా వైరస్ ( Corona Positive )  సోకడంతో పెళ్లి కూతురు తండ్రి పెళ్లి అయిన మరునాడే మరణించాడు. Also Read : TikTok Data: మీ టిక్ టాక్ డేటాను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి


అయితే లాక్ డౌన్ సమయంలో పెళ్లి రద్దవడంతో  అన్‌లాక్  ఆరంభం కాగానే పెళ్లి పనులు మొదలు పెట్టారు.  చివరికి జూన్ 28న కొత్త ముహూర్తానికి పెళ్లి జరిపించారు.  అదే రోజు రాత్రి పెళ్లి కుమార్తె తండ్రి ఆరోగ్యం క్షీణించింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే  ఆయన మరణించాడు.  అప్పటికే వైద్య పరీక్షలు (  Corona Test)  నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకడం వల్లే  అతను మరణించాడని నిర్ధారించారు.  వెంటనే స్థానిక అధికారుకులకు సమాచారం అందించారు. 


వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పెళ్లికి ఎంత మంది హాజరయ్యారో తెలుకున్నారు. నూతన వధూవరులతో పాటు పెళ్లి వేడుకకు హాజరైన బంధువులకు కూడా కోవిడ్ 19  ( Covid 19 Tests ) పరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను క్వారైంటైన్‌కు ( Quarantine ) తరలించారు. అనంతరం వైద్య అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు.  Also Read : రోజుకు లక్ష కేసులు తప్పవు: ప్రముఖ వైద్యుడు వార్నింగ్