ఇదేం విచిత్రం... ఓటర్ల జాబితాలో దివంగత నేత కరుణానిధి పేరు !

దిగంగత నేత కరుణానిధి పేరు ఓటర్ లిస్ట్ లో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది

Last Updated : Aug 23, 2019, 01:05 AM IST
ఇదేం విచిత్రం... ఓటర్ల జాబితాలో దివంగత నేత కరుణానిధి పేరు !

 చెన్నై: బతికి ఉన్న వారిలో లేనట్లుగా.... లేని వారిని ఉన్నట్లుగా చూపించడం యముడికి సాధ్యకాకపోయిన ఓటర్ లిస్ట్ లో మాత్రం సాధ్యపడుతుంది. ఇలాంటి ఘటన మరోక సారి తారస పడింది. తిరువారూర్‌లో సహకార బ్యాంకు ఎన్నికల ఓటర్ల జాబితాలో దివంగత నేత డీఎంకే నేత కరుణానిధి పేరు ఉంది. ఓటర్ల జాబితాలో దక్షిణ వీధి, ముత్తువేల్‌ కుమారుడు కరుణానిధి అని స్పష్టంగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దీనిపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించి కొత్త ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. 

ఎందుకలా జరిగిందంటే...?
తమిళనాడులోని  తిరువారూర్‌ ఉత్తర వీధిలోని కమలాంబిక సహకార పట్టణ బ్యాంకు శతాబ్దకాల క్రితం ప్రారంభమైంది. ఈ బ్యాంకులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తొలిసారిగా సభ్యుడిగా చేరారు. కాగా ఈ బ్యాంకుకు నిర్వాహణ కమిటీ సభ్యుల ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఓటర్ల జాబితాలో దాదాపు 14 వేల మంది పేర్లు ఉండగా అందులో దివంగత నేత కరుణానిధి పేరు ఉండటంతో ఇది వివాదాస్పంగా మారింది. కరుణానిధి బ్యాంకు ఖాతా ఇంకా మూసివేయకపోవడంతో ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉన్నట్టు సహకార బ్యాంకు నిర్వాహకులు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది.

Trending News