)
Karur rally stampede fir blames Vijay: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ తొక్కిసలాట ఘటన దేశాన్ని కన్నీళ్లు పెట్టించింది. తమ అభిమాన హీరోను, రాజకీయ నాయకుడ్ని చూసి చిన్న పిల్లలతో సహా 41 మంది దుర్మరణం చెందారు. అయితే.. దీనిపై వెంటనే విజయ్ ను అరెస్ట్ చేయాలని పోస్టర్లు సైతం వెలిశాయి. ఈ క్రమంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉద్దేశపూర్వకంగా ప్రచార సభకు విజయ్ ఆలస్యంగా రావటం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా .. విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం 11 గంటలకే అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం 11 కు రావాల్సి ఉండగా.. రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వచ్చారు.
అప్పటికే అభిమానులు అక్కడ కిక్కిరిసిపోయారు. దీంతో వారికి సరైన షెల్టర్ లు లేకసొమ్మసిల్లి పడిపోయారు. భారీగా ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం మొదలైనవి లేవంటూ చేసిన సూచనలు చేసిన విజయ్ పార్టీ పట్టించుకోలేదన్నారు.
ఈ క్రమంలో జనాలు విజయ్ ను చూసేందుకు భారీగా రావడం, ఏడు వరకు భద్రత సిబ్బందికి కూడా వారిని నియంత్రించడం కష్టమైందన్నారు. పదివేల మందికి అనుమతి తీసుకుంటే.. యాభైవేల మంది వరకు వచ్చారన్నారు.ఈ క్రమంలో ఇదంతా వెరసి ఇంతటి ఘోరానికి కారణమైందని కరూర్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు వివిధ ఆస్పత్రులలో ఇంకా బాధితులు కొలుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి