Helicopter Crash: మరో ఘోర ప్రమాదం.. కేదార్‌నాథ్‌ వెళ్తుండగా కుప్పుకూలిన హెలికాప్టర్‌, 5 మంది ప్రయాణీకులు..

Kedarnath Helicopter crash: మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ గుండా వెళ్తున్న హెలికాప్టర్ అడవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్నవాళ్లు మరణించినట్లుగా సమాచారం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Jun 15, 2025, 09:39 AM IST
Helicopter Crash: మరో ఘోర ప్రమాదం.. కేదార్‌నాథ్‌ వెళ్తుండగా కుప్పుకూలిన హెలికాప్టర్‌, 5 మంది ప్రయాణీకులు..

Kedarnath Helicopter crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి మర్చిపోకముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా గుప్తా కాశి సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఐదుగురు ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నట్లు సమాచారం. వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే ప్రధానంగా ప్రతికూల వాతావరణమే ఘటనకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఇక సంఘటన స్థలం వద్ద చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించగా గౌరికుండ్‌ అడవుల్లోకి వెళ్లాక అక్కడ క్రాష్ అయిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తితో పాటు పైలట్ ప్రాణులతో బయటపడినట్లు సమాచారం.

 ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రమాదం జరిగిందని సమాచారం .కాగా ఇటీవల అహ్మదాబాద్ లో విమానం కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ హెలికాప్టర్ కేదార్ నాథ్ థామ్‌ నుండి గుప్త కాశి వెళ్తుండగా గౌరీ కుండ్‌ అడవుల్లో అదృశ్యమైంది. ఒక నెలలోనే ఇది మూడో సంఘటన అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉన్న వారు ఐదుగురు చనిపోయారు. ఇంకా ఈ హెలికాప్టర్ ప్రమాదంపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. హెలికాప్టర్ ప్రయాణ సమయంలో ఐదుగురు పెద్దవాళ్లతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు.

జూన్ 7న హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు యాత్రికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బదాసు నుంచి కేదార్నాథ్ కి వెళ్తున్న మరో హెలి కాప్టర్లో సాంకేతిక లోపం అవ్వడంతో దాన్ని కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

మరణించిన వారు..
విక్రమ్‌ రావత్ 
రాజ్ వీర్‌
వినోద్ (ఉత్తర ప్రదేశ్)
తృష్టి సింగ్ (ఉత్తర ప్రదేశ్)
రాజ్ కుమార్ (గుజరాత్) 
 శ్రద్ధ (మహారాష్ట్ర)
 రాశి (10)
 హెలికాప్టర్ నోడల్ అధికారి అయిన రాహుల్ చౌడే ఈ ప్రమాదం గురించి ధృవీకరించారు. గౌరీ కుందుపైన గడ్డి కోయడానికి వెళ్ళిన మహిళలు హెలికాప్టర్ ప్రమాదాన్ని చూసి ఫిర్యాదు చేశారు

 

Also Read :  Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్‌ ట్రంప్..

Also Read :  భగ్గుమంటున్న పశ్చిమాసియా.. మిస్సైల్ దాడితో తగలబడి పోతున్న ఎయిర్ పోర్టు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News