Kedarnath yatra Helicopter Booking: కేదర్‌నాథ్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఈ యాత్రకు వెళ్లేవారు ముందుగానే హెలీకాప్టర్ బుక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మీ స్మార్ట్ ఫోన్‌లోనే ఎక్కడకు వెళ్లకుండా హెలీకాప్టర్ బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
కేదర్‌నాథ్‌కు హెలీప్యాడ్స్ ఫాటా, షేర్శీ, గుప్తాక్షి వద్ద అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా డెహ్రాడూన్ నుంచి కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఛార్‌దామ్‌య యాత్ర పోర్టల్ లేదా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే, దీనికి ముందుగా మీరు కేదర్‌నాథ్ టిక్కెట్లు కూడా కలిగి ఉండాలి. ఒక్క ఐడీపై ఆరు టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
కేదర్‌నాథ్ వెళ్లే భక్తులు హెలికాప్టర్ బుక్ చేసుకునే సదుపాయం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో ఈ కేదర్‌నాథ్ టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి తెలుసుకుందాం..
బుకింగ్..
www. heliyatra.irctc.co.in ద్వారా హెలికాప్టర్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఛార్‌దామ్‌యాత్ర, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. హెలీకాప్టర్ బుక్ చేసుకునే ముందు ఛార్‌దామ్‌యాత్ర టిక్కెట్లు కలిగి ఉండలి. లేకపోతే హెలికాప్టర్ బుక్ చేసుకోలేరు.
మీ ఫోన్‌లో www.heliyatra.irctc.co.in లింక్‌తో సైనప్ చేసి లాగిన్ చేయండి. మీరు ఒక్కరే ప్రయాణం చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులతోపాటు ప్రయాణం చేసినట్లయితే ఛార్‌దామ్ యాత్ర రిజిస్ట్రేషన్ గ్రూప్ ఐడీ ఎంటర్ చేయండి.
ఇదీ చదవండి: జియో బంపర్ రీఛార్జీ ప్లాన్.. డైలీ డేటా, ఉచిత కాలింగ్‌తోపాటు ఓటీటీలు కూడా..!
అక్కడ మీరు స్లాట్, ఆపరేటర్ సెలక్ట్ చేయండి. ఆ తర్వాత ప్రయాణీకుల వివరాలు నమోదు చేసి డబ్బు చెల్లింపు చేయాలి. టిక్కెట్లు డౌన్‌లోడ్ చేయడానికి మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఇందులో వీఐపీ ప్యాకేజీ అయితే, రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. మొత్తం రౌండ్ ట్రిప్, వీఐపీ దర్శనం, ఫుడ్ ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు.
కేదర్‌నాథ్ వెళ్లేవారు కచ్చితంగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వెళ్లండి. ఒక గంట ముందుగానే చేరుకోవాలి. ఏవైనా వాతావరణ మార్పులు జరిగతే ట్రిప్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌కాపీ అవసరమేలేదు.. ఈ కొత్త యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









