Kerala man Video: బస్సులో యువతి చాతీని టచ్ చేశాడని ఆరోపణలు..?.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో ..

Kozhikode man suicide : కోజికోడ్ లో రన్నింగ్ బస్సులో తన పట్ల ఒక వ్యక్తి  అసభ్యంగా ప్రవర్తించాడని  యువతి వీడియో రికార్డు చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది దీనిపై అతడ్ని ఏకీపారేశారు. అసలు ఏంజరిగిందో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 19, 2026, 12:59 PM IST
  • కేరళ రన్నింగ్ బస్ లోషాకింగ్ ఘటన..
  • యువతి ఆరోపణలతో నిండు ప్రాణం బలి..
Kerala man Video: బస్సులో యువతి చాతీని టచ్ చేశాడని ఆరోపణలు..?.. ఇంతలో షాకింగ్ ఘటన.. వీడియో ..

Kerala Kozhikode man ends life after alleging woman molestation in ksrtc bus video:  ఇటీవల చాలా మంది మొబైల్ ఫోన్ లను బీభత్సంగా వాడుతున్నారు. ఎక్కడ ఏంజరిగిన కూడా వెంటనే తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు. అయితే.. చాలా మంది అసలు ఆ వీడియో ఏంటి.. అందులోఏముందో కూడా చూడకుండా వెంటనే దాన్ని అందరికి షేర్లు చేసి వైరల్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటి వైరల్ చేయడంలో కొంత మంది తమ వ్యక్తిగత గౌరవం, ప్రాణాలు సైతం కొల్పోతున్నారు. కొన్నిసార్లు అసలు సంఘటన ప్రదేశంలో జరిగిన దానికి వైరల్ అయిన దానికి అసలు పొంతన ఉండదు. దీంతో చాలా మంది వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

 

తాజాగా.. కేరళలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల బస్సుల్లో కూడా కామాంధులు వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కోజికోడ్ లో రన్నింగ్ బస్సులో యువతి తనపట్ల ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నతీరును సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేరళలో కోజికోడ్‌లోని గోవిందపురం నివాసి దీపక్ యు (42) ఒక టెక్స్‌టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతను ఇటీవల బస్సులో ప్రయాణిస్తుండగా ఒక యువతి అతని పక్కన ఉంది.

ఆమె పట్ల దీపక్ కావాలని అసభ్యంగా ప్రవర్తించాడని , తన పర్సనల్ పార్ట్ లను పలుమార్లు టచ్ చేశాడని యువతి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త జెట్ స్పీడ్ లో వైరల్గా మారింది. దీంతో చాలా మంది దీనిపై దీపక్ ను నోటికొచ్చినట్లు దూశించారు. ఇది ఆయన వరకు కూడా వచ్చింది.

ఇక అందరు ఆయన్ని నేరస్థుడిగా చూడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. దీంతో అతను  ఈ టార్చర్ భరించలేక.. జనవరి 18న ఆదివారం ఉదయం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గమనించిన ఇంట్లో వారు వెంటనే తలుపులు పగలకొట్టి ఆస్పత్రికి తరలించారు . కానీ అప్పటికే అతను చనిపోయాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ యువతి కారణంగానే తన దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆ వీడియోలో కావాలని తాకినట్లు లేదని, దీపక్ అలాంటి వాడు కాదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మొత్తంగా దీనిపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన విచారణ చేపడ్తామన్నారు.

Read more: Snake Video: ఓర్నాయనో.. వయ్యారంగా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న నాగు పాము.. వీడియో వైరల్..

మరోవైపు సోషల్ మీడియా వల్ల అసలు ఆ నేరం అతను చేశాడో కూడా చూడకుండా.. అతనిపై ఆరోపణలు చేయడంతో నిండు ప్రాణం బలైంది.  నిజం గడప దాటేలోగ.. అబద్దం ఊరంతా చక్కర్లు కొడుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు ట్రోలర్స్ పై మండి పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News