)
American groom ties the knot with kerala bride: ఆ అమ్మాయిది కేరళ.. ఆ అబ్బాయిది అమెరికా. మూడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమ్మాయి కేరళ నుండి, అబ్బాయి అమెరికా నుండి ఫ్రాన్స్‌కి వెళ్లారు. అక్కడ సేమ్ కాలేజ్‌లో సేమ్ క్లాస్‌మెట్స్ అయిన వారి మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంకేముంది సీన్ కట్ చేస్తే భారత్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఈ జంట.
కేరళ రాష్ట్రం ఎర్నాకుళంకు జిల్లా ఫోర్ట్ కొచ్చికి చెందిన అంజలి మూడేళ్ల క్రితం పీహెచ్డీ చేసేందుకు ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడే అమెరికాకు చెందిన రాబర్ట్ వెల్స్‌తో పరిచయం అయ్యింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పి వారి అంగీకారం పొందారు.
అయితే ఓనం పండగ సందర్భంగా అంజలి స్వస్థలం అయిన కొచ్చికి వీరిద్దరూ వచ్చారు. స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. కేరళ సంప్రదాయ వస్త్రాల్లో వధూవరులిద్దరూ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లి తర్వాత రాబర్ట్ స్వయంగా మిఠాయిలు పంచి తన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. తన భర్త రాబర్ట్‌కు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా కేరళ వంటకాలంటే కూడా చాలా మక్కువ చూపిస్తారని తెలిపింది. అలాగే తమ అల్లుడు అమెరికా వ్యక్తి కావడం చాలా సంతోషంగా ఉందని అంజలి తల్లిదండ్రులు చెప్పారు.
ఇక వీరి పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఈ జంటను చూసిన నెటిజన్స్ క్యూట్ కపుల్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బెస్ట్ విషెస్ టూ ద న్యూ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook