)
Kisan Pension Yojana: భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించింది. వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ సమృద్ధి కేంద్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన ఉన్నాయి. ఈ పథకాలన్నీ లక్షలాది మంది రైతుల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనే పథకం కింద 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ. 3,000 పెన్షన్ ఇస్తున్నారు. ఈ పథకం రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, సెప్టెంబర్ 12, 2019న మోడీ ప్రభుత్వంలో ప్రారంభించారు. ఇది చిన్న, సన్నకారు రైతుల కోసం ఒక పథకం. ఈ పథకం కింద 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ. 3,000 పెన్షన్ ఇవ్వనున్నారట. ఈ పథకం రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది.
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ పొందేందుకు అర్హులు. రైతు మరణిస్తే, అతని జీవిత భాగస్వామికి 50% పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ రైతు జీవిత భాగస్వామికి మాత్రమే లభిస్తుంది. భర్త ఈ పథకంలో చేరితే పెన్షన్ భార్యకు, భార్య నమోదు చేసుకుంటే పెన్షన్ మొత్తం భర్తకు వెళుతుంది.
ఈ పథకంలో పాల్గొనడానికి, రైతులు నెలకు రూ. 100 (సగటున 29 సంవత్సరాల వయస్సులో) డిపాజిట్ చేయాలి. ప్రభుత్వం అంతే మొత్తాన్ని అందిస్తుంది. ఈ డబ్బు పెన్షన్ చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) యొక్క పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తారు.
నమోదు చేసుకోవడానికి, రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించి, వారి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్ (IFSC కోడ్‌తో) తీసుకురావాలి. గ్రామ స్థాయి వ్యవస్థాపకుడు మీ ఆధార్, పేరు, పుట్టిన తేదీని ధృవీకరిస్తారు. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీని కోసం, మీరు మీ బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌ను నమోదు చేసుకోవాలి.
రైతు వయస్సు ఆధారంగా నెలవారీ సహకారాన్ని ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది. రైతులు ప్రారంభ మొత్తాన్ని నగదు రూపంలో VLEకి చెల్లిస్తారు. తరువాత ఒక ఫారమ్ నింపాలి. VLE దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తుంది. ఆ తర్వాత రైతుకు ప్రత్యేకమైన కిసాన్ పెన్షన్ ఖాతా నంబర్ (KPAN), కిసాన్ కార్డ్ లభిస్తుంది.
ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టంగా అనిపించినప్పటికీ, రైతులు ఈ పథకంలో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ పథకం చిన్న, సన్నకారు రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook