కొలకలూరి ఇనాక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  రచనా దిగ్గజం కొలుకూరి ఇనాక్ ఖాతాలో మరో అవార్డులో వచ్చి చేరింది  

Updated: Dec 5, 2018, 07:23 PM IST
కొలకలూరి ఇనాక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన వెలువడింది.  తెలుగు నుంచి కొలకలూరి ఇనాక్ కు అవార్డు వరించింది. ఇనాక్ రచించిన ‘విమర్శిని’ పుస్తకానికి గాను ఈ అవార్డు లభించింది. కాగా 24 భాషల్లోని సాహిత్య రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించగా తెలుగు భాష నుంచి ‘విమర్శిని’కి ఈ గౌరవం దక్కడం గమనార్హం. కాగా 2019 జనవరి 29న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

కొలకలూరి ఇనాక్ ప్రస్థానం..

రచయిత కొలకలూరి ఇనాక్  ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే... 1954లో ‘లోకంపోకడ’, ‘ఉత్తరం’ అనే కథానికల ద్వారా తెలుగు సాహితీ లోకంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1958లో కొలకలూరి రచించిన ‘దృష్టి’ నాటికను  కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. అలాగే 1988లో ఆయన ‘మునివాహనుడు’ కథా సంపుటికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కొలకలూరి ఇనాక్ ‘విమర్శిని’ రచనకు గాను మరోమారు ఈ పురస్కారం దక్కడం విశేషం.