Kolkata gang Rape Case: కోల్ కతా గ్యాంగ్ రేప్ కేసు.. యువతి ప్రైవేటు పార్ట్స్ లపై పంటిగాట్లు.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు..

Law student rape in Kolkata: వెస్ట్ బెంగాల్ లో లా స్టూడెంట్ పై సాముహిక అత్యాచార ఘటనలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనతో మరోసారి కోల్ కతా భగ్గుమంటుంది. దీనిపై అపోసిషన్ పార్టీలన్ని మమతా సర్కారును ఏకీపారేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 28, 2025, 02:20 PM IST
  • లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..
  • వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Kolkata gang Rape Case: కోల్ కతా గ్యాంగ్ రేప్ కేసు.. యువతి ప్రైవేటు పార్ట్స్ లపై పంటిగాట్లు.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు..

Kolkata law student gang rape case medical shocking facts: పశ్చిమ బెంగాల్ లో మహిళల భద్రత గాల్లో దీపంలా మారిందని అపోసిషన్ పార్టీలన్ని పెద్ద ఎత్తున భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఆర్జీకర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జూనియర్ డాక్టర్ పై రాత్రి అత్యంత దారుణంగా అత్యాచారం ఆపై హత్య ఘటన యావత్ దేశాన్ని కన్నీళ్లను పెట్టించింది. ఇది మరువక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. అది కూడా కాలేజీలోనే మరో గ్యాంగ్ రేప్ జరగటంతో దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. 

Add Zee News as a Preferred Source

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా పాటు, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి రిమాండ్ సైతం విధించింది. ఈక్రమంలో బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు ఆమె పట్ల అత్యంత పాశావికంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. 

బాధితురాలి మెడ, ఛాతీ భాగాలపై పదునైన పంటి గాట్లు ఉన్నట్లు రిపోర్ట్ లో  బైటపడింది. ఆమె శరీరంపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు బైటపడ్డాయి.. ఆమె ప్రైవేటు పార్ట్స్ లను కూడా.. తీవ్రంగా గాయపరిచారని నివేదికలో బైటపడింది. డాక్టర్లు సైతం.. ఈ ఘటన రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు.. యువతి కాళ్లు పట్టుకుని వేధిస్తున్న కూడా ఆమెను కనికరించకుండా.. పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు.  ఈ నెల 25న కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్‌కతా లా కళాశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

మరోవైపు..ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (31) అదే కళాశాల పూర్వ విద్యార్థి. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తూ, అదే కాలేజీలో కాంట్రక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఇతగాడు..టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్‌కతా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Read more: Law Student gang Raped: మరోసారి ఉలిక్కి పడిన కోల్ కతా.. లా విద్యార్థినిపై కాలేజీలోనే గ్యాంగ్ రేప్..

 ఈక్రమంలో తాజాగా.. పోలీసులు సెక్యురిటీ గార్డును కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన మమత సర్కారును ఇరుకున పెట్టేసేదిగా మారింది. ఈ ఘటనపై ఆర్జీకర్ బాధితురాలి తండ్రి సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని భావోద్వేగానికి గురయ్యాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News