Lady police brutally attacked on model chai wali video: సాధారణంగా చాలా మంది చదువుకుని తమకు నచ్చిన రంగంలో రాణించాలనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం జాబ్ కన్నాకూడా.. బిజినెస్ చేసి తమదైన సత్తా చూపించాలను కుంటారు. లైఫ్ లో రిస్క్ చేసి వచ్చే సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే.. లక్నోలో ఉండే సిమ్రాన్ కూడా ఆకోవకు చెందిన యువతి. ఆమె ఉన్నత చదువులు చదువుకున్న ఒకరి కింద ఉండి పనిచేయడం ఆమెకు నచ్చలేదు. దీంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని భావించింది. ఆమె టీ బిజినెస్ స్టార్ట్ చేసింది.
ఆమెను చాలా మంది మోడల్ గా నిలుస్తావని సపోర్ట్ చేశారంట. అందుకే ఆమె తన చాయ్ షాప్ కు కూడా మోడల్ చాయ్ వాలీ అనే పేరు కూడా పెట్టుకుంది. అనుకున్నట్లు గానే ఆమె బిజినెస్ గా అనతికాలంలో ఒక రెంజ్ లో సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె టీ స్టాల్ దగ్గరకు ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి కస్టమర్లు వచ్చేవారు. ఈ క్రమంలో ఆమెకుఇటీవల ఒక షాకింగ్ ఘటన ఎదురైంది.
मॉडल चाय वाली सिमरन के साथ पुलिस में किया अभद्र व्यवहार व मारपीट
लखनऊ। पारिवारिक परिस्थितियों की वजह से मॉडलिंग की दुनिया छोड़कर चाय की दुकान चला कर अपने परिवार का भरण पोषण करने वाली सिमरन गुप्ता से आधी रात को पुलिस ने अभद्र व्यवहार व मारपीट की। pic.twitter.com/6EID56D6dn
— Mohammad Imran (@ImranTG1) June 9, 2025
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది. గిరాకి బాగుందని ఇటీవల సిమ్రాన్ రాత్రి 12 దాటినా షాపును తెరిచే ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు షాపు తెరిచి ఉంచొద్దని అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె షాపు క్లోజ్ చేస్తుండగానే కొంత మంది పోలీసులు అక్కడకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. షాపు క్లోజ్ చేస్తున్నట్లు చెప్పిన వినలేదు.
లేడీ పోలీసులు ఆమె డ్రెస్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు. తాను ఏ తప్పుచేయలేదని చెప్తున్న కూడా విన్పించుకోలేదు. మొత్తంగా సిమ్రాన్ ను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడున్న వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది వైరల్ కావడంతో ఉన్నతాధికారులు మోడల్ చాయ్ వాలీపై చేయిచేసుకున్న అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన పట్లు నెటిజన్లు మాత్రం పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ఒక సాటి మహిళ అని కూడా చూడకుండా లేడీ పోలీసు ఆమెను ఈడ్చుకెళ్లడం దారుణమంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









