)
Richest Chief Ministers In India Telugu: భారతదేశంలో అనేకమంది సంపన్నులు కలిగిన వ్యక్తులున్నారు. అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో కూడా భారతీయులు ఉన్నారు. ఇక భారతదేశం సంపన్నుల జాబితాలో భాగంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన అధిపతులు టాప్ టెన్ లో ఉన్నారు. ఇక దేశంలోనే ముఖ్యమంత్రిల ఆస్తిపాస్తుల వివరాల్లోకి వెళ్తే.. ఎవరు టాప్ లో ఉన్నారని అంశాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే సంస్థ 2025 ఆగస్టులో ఓ లిస్టు విడుదల చేసింది. అయితే ఈ నివేదిక ప్రకారం దేశంలోని రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంస్థ మన భారతదేశంలోని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ క్రిమినల్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ వివరాలు ఆఫిడవిట్లో పేర్కొన్న ఇతర వివరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సంస్థ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆయన సంపాదనలో అత్యధిక బాట హెరిటేజ్ ఫుడ్స్ నుంచి వచ్చిందే.. 19 92 సంవత్సరంలో ఈ కంపెనీని ప్రారంభించారు. ఇందులో నారా కుటుంబానికి 35 75 శాతం వాటా విలువను కలిగి ఉంది. అంటే ఈ వాటా దాదాపు రూ.2,400 కోట్లుగా ఉంటుంది. ఆయన అఫిడవిట్లో తెలిపిన వివరాల ప్రకారం.. అప్పులు 10 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 2025 ADR రిపోర్ట్ విడుదల చేసిన టాప్ టెన్ సంపన్నుల ముఖ్యమంత్రి వివరాల్లోకి వెళితే.. మొదటి స్థానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండగా.. రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు.. ఆయన దేశంలోనే ముఖ్యమంత్రుల సంపన్నుల జాబితాలో రెండవ స్థానం కలిగిన వారు. ఈయన ఆస్తులు రూ.931 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక మూడవ స్థానంలో సిద్ధరామయ్య (కర్ణాటక) రూ.51 కోట్లు, నాలుగవ స్థానంలో నిఫ్యూ రియో (నాగాలాండ్) రూ.46 కోట్లు, ఐదవ స్థానంలో మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్): రూ.42 కోట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.30 కోట్లు ఆరవ స్థానంలో ఉన్నట్లు నివేదికలో తేలింది.
అలాగే అత్యంత పేద ముఖ్యమంత్రిలకు సంబంధించిన జాబితాను కూడా ఈ సంస్థ విడుదల చేసింది. అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులు మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె సంపాదన 15 లక్షలు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఇక చివరి నుంచి రెండవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర అబ్దుల్లా, చివరి నుంచి మూడో స్థానం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఐదో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook