)
LIC AAO Recruitment 2025: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ LIC శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ LIC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
> SC కేటగిరీలో పోస్టుల సంఖ్య : 51
> ST కేటగిరీలో పోస్టుల సంఖ్య: 22
> OBC కేటగిరీలో పోస్టుల సంఖ్య: 88
> EWS కేటగిరీలో పోస్టుల సంఖ్య: 38
> జనరల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 142
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థుల వయోపరిమితి ఆగస్టు 1, 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwB అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 700 చెల్లించాల్సి ఉండగా, SC, ST, PwB అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 85 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 88,635 నుండి రూ. 1,69,025 వరకు జీతం చెల్లిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 2025న జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన వారు నవంబర్ 8, 2025న ప్రధాన పరీక్ష రాయనున్నారు . మరిన్ని వివరాల కోసం.. అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.