Bihar girl with Rahul Gandhi Video: మీరే నాకు ఆదర్శం.. పెళ్లి చేసుకోకుండా ఆ పనిచేస్తా..!.. రాహుల్ గాంధీతో యువతి క్రేజీ సంభాషణ.. వీడియో వైరల్..

Girl interaction with rahul gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు. ఈక్రమంలో బీహర్ కు చెందిన ఒక యువతి రాహుల్ గాంధీతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 7, 2025, 08:03 PM IST
  • రాహుల్ గాంధీతో యువతి సంభాషణ..
  • పెళ్లి చేసుకొనంటూ కామెంట్స్..
 Bihar girl with Rahul Gandhi Video: మీరే నాకు ఆదర్శం.. పెళ్లి చేసుకోకుండా ఆ పనిచేస్తా..!.. రాహుల్ గాంధీతో యువతి క్రేజీ సంభాషణ.. వీడియో వైరల్..

Rahul gandhi interaction with bihar girl video: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లిపై తరచుగా వార్తలు వస్తునే ఉంటాయి. ఆయన ఎక్కడకు వెళ్లిన కూడా ఆయన పెళ్లిపై కార్యకర్తలు, నేతలు డిస్కషన్ తీసుకొని వస్తునే ఉంటారు. యాభై ఏళ్లు దాటిన కూడా ఇంకా రాహుల్ గాంధీ పెళ్లి మాట ఎత్తక పోవడంపై చాలా మంది నేతలు.. ఆయనకు దేశంపై ఉన్న డెడికెషన్ అలాంటిదని చెబుతుంటారు. ఈక్రమంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ.. బీహర్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రియా అనే యువతి రాహుల్ గాంధీతో పెళ్లి విషయంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.

Add Zee News as a Preferred Source

 

బీహర్ లోని గయలో జరిగిన మహిళా సంవాద్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీఎత్తున కాంగ్రెస్ శ్రేణులు , కార్యకర్తలు పాల్గొన్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన శక్తి అభియాన్ ను ఆకర్శితమై.. తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ప్యాడ్ గర్ల్ గా పిలిచే.. రియా పాస్వాన్ స్టేజీ మీద రాహుల్ తో మాట్లాడింది.  తాను మురికి వాడల నుంచి వచ్చానని చెప్పింది. తనకు ఎవరి రాజకీయ ప్రొద్బలం, అండదండలు లేవని చెప్పుకొచ్చింది.

కేవలం ప్రజలకు మంచి చేయాలని ఒక తపన ఉందని రియా మాట్లాడింది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాంగ్రెస్ చేపట్టిన శక్తి అభియాన్ వల్లే జీవితంలో ఎంతో పురోగతి సాధించినట్లు ఆమె తెలిపింది. మరోవైపు రియా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రసంగాలు తనకు రాజకీయాలవైపు వచ్చేలా చేశాయని చెప్పుకొచ్చింది.

అదే విధంగా మీలాగే తాను కూడా.. పెళ్లి చేసుకొకుండా.. జీవితాంతం రాజకీయాల్లో ఉండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నట్లు మాట్లాడింది. దీంతో అక్కడున్న వారంత నవ్వుతూ కొంత మంది.. చప్పట్లతో మరికొందరు ఆమెను ప్రశంసించారు. 

Read more: Sonia Gandhi: సోనియా గాంధీ హెల్త్ కండీషన్ సీరియస్..?.  ఆస్పత్రికి తరలింపు.. టెన్షన్ లో కాంగ్రెస్ శ్రేణులు..

మరోవైపు.. రియా..  2022లో ఉచిత శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ గురించి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాను క్వశ్చన్ చేసింది. దీంతో అప్పటి నుంచి రియా తరచుగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక తాజాగా.. రాహుల్‌ గాంధీతో ఆమె చేసిన సంభాషణకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News