Pahalgam Attack Latest News in Telugu: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుపై వెళ్లిన సైనికులను వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ ద్వివేది.. సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎల్‌ఓసీ వద్ద పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని.. వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్‌ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ ఫాలో అవ్వండి.









