Election Results Live: మహారాష్ట్రలో సెంచరీ కొట్టిన బీజేపీ.. జార్ఖండ్‌లో జేఎంఎం పార్టీ విజయం
Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్‌డేట్స్
Maharashtra And Jharkhand Poll Results: ఆదివాసీల అడ్డాలో గెలిచేదెవరు? మరాఠా అధికార పీఠంపై కూర్చునేది ఎవరు? దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఈసారి అధికారం ఎవరిదనేది తేలిపోయింది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికార కూటములకే అక్కడి ఓటర్లు పట్టం కట్టారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సెంచరీ మార్క్ కొట్టేసింది. 220కు పైగా స్థానాల దిశగా మహాయుతి కూటమి దూసుకొచ్చింది. జార్ఖండ్ లో జేఎంఎం పార్టీ నేతృత్వంలో కూటమి విజయ దుందుంభి మోగించింది. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ఫలితాలు ఆసక్తిగా మారాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటికి విజయం ఖరారైంది. ఎవరికి ఎన్ని స్థానాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫలితాలతో బీజేపీ జోష్ లో ఉండగా.. కాంగ్రెస్ కు మాత్రం కొంత మోదం ఖేదం వంటి పరిస్థితి ఏర్పడింది. ఓట్ల లెక్కింపు అప్డేట్స్ నిమిష నిమిషానికి ఎన్నికల ఫలితాలు అందిస్తున్నాం.
Latest Updates
మహారాష్ట్ర, జార్ఖండ్ లో దాదాపుగా ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తెలిశాయి. అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగుస్తోంది. అధికారం అనేది ఎవరిదో తెలియన పక్షంలో అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో తెలుసుకుందాం.
మహారాష్ట్రలో పార్టీలవారీగా ఫలితాలు
బీజేపీ 130
శివసేన (షిండే వర్గం) 57
ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) 40
కాంగ్రెస్ పార్టీ (18)
శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) 19
ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) 12జార్ఖండ్ (81 స్థానాలు)
జేఎంఎం కూటమి: 56 స్థానాలు
బీజేపీ కూటమి: 24 స్థానాలు
ఇతరులు: 1 స్థానంప్రియాంక గాంధీ స్పందన
నా గొంతు విప్పుతా: వయనాడ్‌లో విజయంపై ప్రియాంక గాంధీ స్పందించారు. 'ఈ విజయం మీదే. ఇక నా గొంతు వినిపిస్తా. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఉప్పొంగిపోతున్నా. గెలిపించిన ఓటర్లందరికీ ధన్యవాదాలు' అని ప్రియాంక చెప్పారు.సీఎం పదవిపై వివాదం లేదు: దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో భారీ విజయంపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'మహారాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నారని చెప్పడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తప్పుడు కథనాలు.. మతం ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవడం వంటి ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. ఓటర్ల మద్దతు.. పార్టీ శ్రేణుల సహాయంతో ప్రతిపక్షాల చక్రవ్యూహాన్ని చేధించడంలో సఫలమయ్యాం' అని తెలిపారు.
ముఖ్యమంత్రి పదవిపై స్పందిస్తూ.. 'సీఎం పదవిపై వివాదాలు లేవు. ముఖ్యమంత్రి ఎవరు అనేది మహాయుతి పార్టీల నాయకులు నిర్ణయిస్తారు' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
స్పష్టమైన తీర్పు
ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఆది నుంచి బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండి అధికారాన్ని సొంతం చేసుకోబోతుండగా.. జార్ఖండ్‌లో మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి. మొదట బీజేపీ కూటమి ముందంజలో ఉండగా.. తర్వాత జేఎంఎం పార్టీ నేతృత్వంలోని కూటమి దూసుకొచ్చి అధికారాన్ని సొంతం చేసుకోబోతున్నది. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు సరళి చూస్తే ఫలితాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్ర (మొత్తం స్థానాలు 288)
బీజేపీ మహాయుతి కూటమి: 223
మహాఘట్‌బంధన్ కూటమి: 47
ఇతరులు: 18జార్ఖండ్ (మొత్తం 81)
జేఎంఎం పార్టీ కూటమి: 51
బీజేపీ: 30
ఇతరులు: 0కేంద్ర హోంమంత్రి అభినందనలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు ఫోన్ చేసి అభినందించారు.ముహూర్తం ఇదే..
గతంలో కన్నా అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని మహాయుతి కూటమి మహారాష్ట్రలో తిరిగి అధికారం సొంతం చేసుకుంది. ఫలితాలు స్పష్టంగా తెలియడంతో ప్రమాణస్వీకారానికి బీజేపీ నేతృత్వంలోని కూటమి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం. అయితే సీఎంగా ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఏక్‌నాథ్ షిండేకు తిరిగి అవకాశం ఇస్తారా? లేదంటే మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా అనేది ఉత్కంఠ నెలకొంది.ఈ విజయం వారికే అంకితం
అఖండ విజయం సాధించడంపై మాహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. 'ఈ విజయం మహిళలకు అంకితం. భారీ విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం మేము చేసిన పనులకు నిదర్శనం' అని తెలిపారు.వెలువడిన తొలి ఫలితం
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెల్లడైంది. బీజేపీ తొలి బోణీ కొట్టింది. వడాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ 59,764 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.మహాయుతిదే అధికారం
మహారాష్ట్రలో తిరిగి మహాయుతి కూటమి అధికారంలోకి రానుంది. స్పష్టమైన ఆధిక్యంతో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరనుందని ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే చెప్పవచ్చు. 288 స్థానాల్లో 220 చోట్ల మహాయుతి కూటమి దూకుడుగా వెళ్తుండగా.. మహాఘట్‌బంధన్ కేవలం 53 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు 15 చోట్ల ముందంజలో ఉన్నారు.జార్ఖండ్‌లో అధికారం దిశగా జేఎంఎం
జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠతో కొనసాగుతున్నాయి. ఆధిక్యంలో ఉన్న బీజేపీ కూటమిని తోసేసి జేఎంఎం కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. 81 స్థానాల్లో ఏకంగా 49 చోట్ల ముందంజలో ఉండగా.. బీజేపీ కూటమి 30 స్థానాల్లో.. ఇతరులు రెండు చోట్ల ముందజంలో ఉన్నారు.200 మార్క్ దాటిన మహాయుతి
ఓట్ల లెక్కింపు మొదలుపెట్టినప్పటి నుంచి మహాయుతి కూటమి దూసుకుపోతుంది. స్పష్టమైన ఆధిక్యంతో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. 288 స్థానాల్లో 212 చోట్ల మహాయుతి కూటమి దూకుడుగా వెళ్తుండగా.. మహాఘట్‌బంధన్ కేవలం 60 స్థానాలకు పరిమితమవడం గమనార్హం. ఇతరులు 16 చోట్ల ముందంజలో ఉన్నారు.జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి
అనూహ్యంగా జార్ఖండ్ ఓట్ల లెక్కింపు మారిపోయింది. మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ కూటమిని వెనక్కి నెట్టేసి జేఎంఎం కూటమి భారీ ఆధిక్యంతో దూసుకొచ్చింది. 81 స్థానాల్లో ఏకంగా 50 చోట్ల ముందంజలో ఉండడం విశేషం. బీజేపీ కూటమి 28 స్థానాల్లో.. ఇతరులు రెండు చోట్ల ముందజంలో ఉన్నారు.ప్రముఖులు ఇలా..
కరాడ్ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెనుకంజలో ఉన్నారు.
బారామతిలో ఆసక్తికర పోరు నడుస్తోంది. బాబాయ్ అజిత్ పవార్.. అబ్బాయ్ యుగేంద్ర పోటీ చేస్తుండగా.. బాబాయ్ ముందంజలో కొనసాగుతున్నారు.
ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగడం గమనార్హం. ఇంతియాజ్ జలీల్ ముందంజలో ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
హీరోయిన్ స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. ఎన్సీపీ (శరద్ పవార్) తరఫున అనుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
జార్ఖండ్‌లో ప్రముఖులు ఇలా..
బర్హైత్‌లో ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అభ్యర్థి హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు.
సీఎం సతీమణి కల్పనా సోరెన్ గండె నియోజకవర్గంలో ఆధిక్యం కనబరుస్తున్నారు.
సరాయ్‌కెలాలో మాజీ సీఎం చంపై సోరెన్ ముందంజలో కొనసాగుతున్నారు.
మెజార్టీ మార్క్ దాటిన బీజేపీ కూటమి
మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలోనే కొనసాగుతోంది. 288 స్థానాల్లో కావాల్సిన మెజార్టీ మార్క్‌ను దాటేసి 152 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్‌బంధన్ కూటమి 84 స్థానాల్లో ఆధిక్యం ఉండగా.. ఇతరులు 9 చోట్ల ముందంజలో ఉన్నారు.జార్ఖండ్‌లో బీజేపీ కూటమి ముందంజ
జార్ఖండ్ ఓట్ల లెక్కింపులో అధికారం అనేది స్పష్టంగా ఎవరికీ తేలడం లేదు. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో బీజేపీ కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి స్పష్టమైన తీర్పు ఓటర్లు ఎవరికీ ఇచ్చినట్టు కనిపించడం లేదు.
ప్రముఖులు ఎవరు ఎక్కడ
మహారాష్ట్ర కొప్రిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందంజ
వర్లిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఆధిక్యం
మాహింలో రాజ్‌ఠాక్రే కుమారుడు అమిత్ వెనుకంజ
కొలాబాలో స్పీకర్ రాహుల్ నర్వేకర్ ముందంజ
బారామతిలో అజిత్ పవార్ ముందంజ
సపోలిలో పీసీసీ చీఫ్ నానా పటోలె వెనుకంజ
బీజేపీ కొత్త ఉత్సాహం
మహారాష్ట్రలో బీజేపీ కూటమి కొత్త ఉత్సాహంతో ఉంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో మెజార్టీకి చేరువగా మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. 288 స్థానాల్లో 135 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్‌బంధన్ కూటమి 90 స్థానాల్లో.. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హోరాహోరీ
జార్ఖండ్‌లో హోరాహోరీగా కొనసాగుతోంది. 81 స్థానాల్లో 29 స్థానాల్లో బీజేపీ కూటమి, 23 చోట్ల జేఎంఎం కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.కాంగ్రెస్‌కు జోష్.. ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ. వయానాడ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా తొలి రౌండ్‌లోనే 460 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.ఆరంభ ఆధిక్యం బీజేపీ కూటమిదే
మరాఠా గడ్డ
మహారాష్ట్ర ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆరంభమే మహాయుతి కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. 288 స్థానాల్లో 40 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్‌బంధన్ కూటమి 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆదివాసీ అడ్డాపై
జార్ఖండ్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి ఆరంభమే అదరగొట్టింది. 81 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేఎంఎం పార్టీ, కాంగ్రెస్ కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
47 ఉప ఎన్నికలు
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశంలోని 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు కూడా నేడు వెలువడుతున్నాయి.వయనాడ్‌పై ఉత్కంఠ
ఇక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీగా ఏర్పడిన వయనాడ్ ఉప ఎన్నిక కూడా జరగ్గా అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేశారు. వయానాడ్ ఫలితం కూడా నేడే రానుంది.మెజార్టీ మార్క్ ఇలా..
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. 144 సీట్లు మెజార్టీ మార్క్. మెజార్టీ మార్క్ వచ్చిన కూటమి లేదా పార్టీలు అధికారం చేపడతాయి.
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా అధికారం దక్కాలంటే 41 సీట్లు ఆధిక్యం వస్తే చాలు. ఆ పక్షానిదే అధికార పీఠం.
మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
మహారాష్ట్రలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఎవరికీ మెజార్టీ రాని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు సిద్ధంగా ఉన్నాయి.