Jammu Kashmir Terrorist Attack Live Updates: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్ గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా.. ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ ప్రాంతంలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులు ఉండగా.. అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఊహించని రీతిలో కాల్పులు జరపడంతో కొంతమంది అక్కడిక్కడే కుప్పకూలి మరణించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురికాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ వారిని రక్షించాలంటూ బాధితులు చేస్తున్న వీడియోలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









