Add Zee Business As A Preferred Source
App
Live Now

Pahalgam Attack LIVE: పాక్ రేజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్.. రెండు దేశాల మధ్య ఉత్కంఠ

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారంతో రగిలిపోతుంది. పాకిస్థాన్‌ను చావు దెబ్బకొట్టేలా సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రదాడిని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.      
Pahalgam Attack LIVE: పాక్ రేజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్.. రెండు దేశాల మధ్య ఉత్కంఠ
Image Credit: Pahalgam Attack Live Updates
24 April 2025 07:34 PM (IST)

24 April 2025 07:22 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: ఉగ్రదాడిలో అసువులు బాసిన మధుసూదన్ రావుకు ఈరోజు మధుసూదన్ రావుకు అంతిక్రియలు కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, మధుసూదన్ రావు భౌతిక  కాయాన్ని తమ భుజాలపై మోసి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.
 

24 April 2025 07:07 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: బార్డర్ దాటిన భారత జవాన్.. బంధించిన పాకిస్థాన్.. భారత్ ఏం చేయనుంది..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

24 April 2025 06:34 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాపీ కొడుతూ పాక్ కూడా అవే నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

24 April 2025 06:19 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: కాట్రా, ఉధంపూర్ (MCTM) జమ్మూ స్టేషన్లలో చిక్కుకున్న పర్యాటకులను తరలించడానికి భారత రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది.

==> కాట్రా, జమ్మూ స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది. జమ్మూ, కాట్రా నుంచి CCTV ఫీడ్‌తో జమ్మూ నియంత్రణలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ రూమ్‌ను అందించడంతో పాటు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌లు ఉన్నాయి.
==> జమ్మూ, కాట్రాలోని హెల్ప్‌డెస్క్ సిబ్బంది వివిధ రైళ్లలో 235 మంది పర్యాటకులకు వసతి కల్పించారు.
==> చాలా తక్కువ సమయంలో NDLS కోసం ఒక ప్రత్యేక రైలు నంబర్ 04612 spcl ex SVDKని ప్లాన్ చేసి నిర్వహించింది. ఈ రైలు 21:20కి SVDK, JAT 23:27కి బయలుదేరింది. దాదాపు 67 శాతం ఆక్యుపేషన్‌లో దాదాపు 580 రిజర్వ్డ్ పీఎస్‌లు, దాదాపు 180 అన్‌రిజర్వ్డ్ పీఎస్‌లు ఉన్నాయి.
==> IRCTC, RPF/GRP సమన్వయంతో కాట్రా, MCTM, జమ్మూ స్టేషన్లలో ఆహారం అందించారు.
==> మరో spcl 04614 24.4.25న 13.30 గంటలకు SVDK నుంచి బయలుదేరిందని అధికారులు తెలిపారు.

24 April 2025 06:14 PM (IST)

24 April 2025 06:10 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలో సరిహద్దును పొరపాటున దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్‌ను పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. కానిస్టేబుల్‌ విడుదల కోసం రెండు దళాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

24 April 2025 05:10 PM (IST)

Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్థాన్ తిరస్కరించింది. ఇది 240 మిలియన్ల పాకిస్థానీయులకు జీవనాధారమని పేర్కొంది.

24 April 2025 04:35 PM (IST)

24 April 2025 03:56 PM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థానీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు ఈ నెల 27వ తేదీ వరకు, వైద్య వీసాలు 29వ తేదీ వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేశారు. వీసా గడువు ముగిసేలోపు అందరూ దేశం విడిచి వెళ్లాలని చెప్పారు. అదేవిధంగా పాకిస్థాన్‌లో ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా మన దేశానికి తిరిగి రావాలని సూచిస్తున్నారు. 

24 April 2025 02:50 PM (IST)

24 April 2025 02:45 PM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడికి బలమైన ప్రతిస్పందన అవసరమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. పాకిస్థాన్ మద్దతు గల ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  
 

24 April 2025 01:50 PM (IST)

24 April 2025 01:43 PM (IST)

Pahalgam Attack Live Updates: ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముందుగా ఆసుపత్రిలోని చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులు అర్పించి అనంతరం ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

==> కాల్పుల సంఘటనను ప్రతిఒక్కరు ఖండించాలి

==> నిరాయుదులైన వారిపై దాడిచేసి చంపడం చాలా దారుణం

==> లక్షల్లో టూరిస్టులు వెళ్ళే ప్రాంతంలో ముష్కరులు పథకం ప్రకారం కాల్పులు జరిపిన వెళ్ళిన పట్టించుకునే వారు లేరు

==> భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది

==> దీనికి కేంద్ర ప్రభుత్వం, మోదీ మిత్షా బాధ్యత వహించాలి

==> మోడీ, అమీషా రాజినామా చేయాలి

==> దేశంలో ఇంత దారుణ ఘటన జరిగితే ఇంటిలిజెన్స్ వ్యవస్త ఏం చేస్తుంది

==> ఇంటిలిజెన్స్ పూర్తిగా మోదీ కి నచ్చని వారిపై కేసులు పెట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారు..

==> దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు..

==> దాని ఫలితమే ఈ దాడులు, ఇంతమంది మరణం..

==> ఇది చాలా అన్యాయం, మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలి

==> మతాల మధ్య చిచ్చు పెట్టీ పబ్బం గడుపుకోడం బీజేపీ నైజం

==> సెక్యులర్ దేశం గా ఉన్న భారతదేశం లో  మోదీ మతాలను ఎలా ప్రోత్సహిస్తారు?!

24 April 2025 01:19 PM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ఉన్నవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దేశం న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ఉగ్రవాదం శిక్షించబడకుండా ఉండదని.. న్యాయం జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతాయన్నారు. బీహార్‌లోని మధుబనిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. 

24 April 2025 12:56 PM (IST)
24 April 2025 12:54 PM (IST)

Pahalgam Attack Live Updates: జమ్ము కశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు

24 April 2025 12:44 PM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలకు శివసేన (యూబీటీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలోనైనా తన సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.

24 April 2025 12:24 PM (IST)

24 April 2025 12:17 PM (IST)

Pahalgam Attack Live Updates: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో హిందువులు కొవ్వొత్తులు చేతబట్టి రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టి భారతమాతకు జై పలుకుతూ హిందువుల ఐకమత్యం వర్ధిల్లాలని.. ఉగ్రవాదం నశించాలని, ఉగ్రవాదులను శిక్షించాలని నినాదాలు చేశారు.

24 April 2025 12:12 PM (IST)

Pahalgam Attack Live Updates: పాకిస్థాన్‌ను అష్ట దిగ్బందనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను బ్యాన్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

24 April 2025 12:07 PM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్‌ ఉగ్రదాడి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు బీహార్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 28 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దాడి దేశాన్ని తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. 

24 April 2025 11:57 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి మృతులకు కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు.

 

24 April 2025 11:46 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడిని "వికారమైన" చర్యగా అభివర్ణించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ వైఖరి కారణంగా ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారు పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.

24 April 2025 11:44 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్‌  ఉగ్రదాడి తరువాత  ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌  కార్యాలయం సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌  చేసుకున్నట్టు  సమాచారం. ఈ మేరకు  దేశ ఇంటలిజెన్స్‌  వర్గాలకు  కీలక సమాచారం అందింది. 

24 April 2025 11:36 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో భారత భత్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

24 April 2025 11:31 AM (IST)

24 April 2025 11:24 AM (IST)
24 April 2025 11:22 AM (IST)

Pahalgam Attack Live Updates: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించింది. 
 

24 April 2025 11:00 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి, జాతీయ భద్రతా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 6 గంటలకు పార్లమెంటు భవనంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
 

24 April 2025 10:40 AM (IST)

Pahalgam Attack Live Updates: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

24 April 2025 10:10 AM (IST)

Pahalgam Attack Live Updates: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటన కోసం చేసుకున్న బుకింగ్స్ 90 శాతం వరకూ రద్దు చేసుకున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడకు వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపడం లేదని తెలిపాయి. కాగా ముష్కరుల దాడి నేపథ్యంలో అక్కడినుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తిరిగి వస్తున్న విషయం తెలిసిందే.

24 April 2025 10:04 AM (IST)

Pahalgam Attack Live Updates: జమ్మూకశ్మీర్లో ఎన్‌కౌంర్ జరిగింది. ఉదంపూర్లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్ క్యాంపుల నుంచి అక్కడకు భారీగా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

24 April 2025 10:01 AM (IST)

Pahalgam Attack Live Updates: సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి..? కేంద్రం నిర్ణయంతో పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.